- తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటన
- నీట మునిగిన పొలాల్లో నడుస్తూ, పంట నష్టాన్ని స్వయంగా అంచనా
- రాత్రి పగలు సమీక్షలు, టెలికాన్ఫరెన్సులతో యంత్రాంగాన్ని అప్రమత్తం
- తుఫాను నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
- యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ, సహాయక చర్యల పర్యవేక్షణ
సచివాలయంలో సమీక్షలు, టెలికాన్ఫరెన్సులకే పరిమితం కాకుండా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పొలం గట్లపైకి, పంట బోదెల మీదకు వెళ్లి తుపాను సృష్టించిన బీభత్సాన్ని స్వయంగా పరిశీలించారు. రైతు కష్టం తెలిసిన నాయకుడిగా, అన్నదాతల కన్నీళ్లు తుడిచేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. భారీ వర్షాలకు నీట మునిగి కళ్లెదుటే పంట నాశనమవుతుంటే గుండెలు బాదుకుంటున్న కర్షకులకు అండగా నిలిచారు. ధ్వంసమైన రహదారుల్లో, బురదమయమైన పొలాల్లో నడుస్తూ, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
తుపాను హెచ్చరికలు జారీ అయిన అక్టోబరు 27వ తేదీ నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. 'అర్నబ్', 'మురసు' తుపానుల సమయంలో రాత్రిళ్లు కూడా మేల్కొని కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్సులు నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ప్రజల తరలింపు, సహాయక చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించారు. రాష్ట్ర యంత్రాంగాన్ని సమన్వయం చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అవసరమైన సహాయం కోసం కృషి చేశారు. ఒకవైపు ఉన్నతాధికారులతో సమీక్షలు, మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలతో విపత్తు నిర్వహణలో తనదైన మార్క్ చూపించారు. ఆయన ముందుచూపు, సత్వర స్పందన వల్ల పెను నష్టాన్ని నివారించడంలో యంత్రాంగం సఫలమైంది.
క్షేత్రస్థాయిలో పర్యటనలతో వాస్తవాల పరిశీలన
అధికారులు ఇచ్చే నివేదికలతో సరిపెట్టకుండా, వాస్తవ నష్టాన్ని కళ్లారా చూసేందుకు చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇటీవలి 'అర్నబ్' తుపాను సమయంలో కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నరసాపురం వరకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించారు. తాజాగా 'మురసు' తుపాను కారణంగా అతలాకుతలమైన బాపట్ల జిల్లాలోని జిల్లెళ్లమూడి, గుంటూరు జిల్లాలోని రేటూరు గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన వరి పొలాల్లోకి వెళ్లి, పంట బోదెల వద్ద నిలబడి నష్టాన్ని అంచనా వేశారు. బురదలో, పొలం గట్లపై తిరిగి పంటలు దెబ్బతిన్న వైనాన్ని కళ్లారా చూశారు.
పర్యటనలో భాగంగా, రైతుల వద్దకే నేరుగా వెళ్లి వారి ఆవేదనను ఓపికగా విన్నారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయారు, ఎంత పెట్టుబడి పెట్టారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం ఆశిస్తున్నారనే వివరాలను వారినే అడిగి తెలుసుకున్నారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటిపాలైన రైతుల బాధను చూసి చలించిన ఆయన, అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తుల వల్ల రైతులు కుంగిపోకుండా, తిరిగి ధైర్యంగా వ్యవసాయం చేసుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.