- కేరళలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- కాంగ్రెస్ అబద్ధాలకు కేరాఫ్‌గా మారిందని విమర్శ
- అమిత్ షా హైదరాబాద్ పర్యటనతో ఆరోపణలకు సమాధానం ఇస్తారని వెల్లడి
- అమిత్ షా పాదయాత్రకు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపాదే అధికారమని ధీమా
ఓట్ చోరీ ఆరోపణలపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగితే రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి ఎలా గెలిచారని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ ప్రభావం ఉంటే కేరళలో కాంగ్రెస్ ఎలా విజయం సాధించిందని నిలదీశారు. కాంగ్రెస్ అబద్ధాలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు.
కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నారని రాంచందర్ రావు తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు నమ్మకం పోయేలా చేయడం ప్రమాదకరమన్నారు. అలాంటి పరిస్థితులు దేశంలో అరాచకానికి దారితీస్తాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలకు వివరించేందుకే అమిత్ షా పర్యటన చేపడుతున్నారని చెప్పారు.
అమిత్ షా పాదయాత్రకు లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందని రాంచందర్ రావు వెల్లడించారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు హైదరాబాద్ వేదికగా అమిత్ షా సమాధానం చెబుతారని అన్నారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భాజపా కచ్చితంగా అధికారంలోకి వస్తుందని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని తెలిపారు.