- హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
- బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన బీజేపీ నేతలు
- భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
- ఐటీసీ కాకతీయలో పార్టీ నేతలతో సమావేశం
- జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా అమిత్ షా చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన ఐటీసీ కాకతీయ హోటల్‌లో భోజనం చేయనున్నారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ‘లోక్‌తంత్ర బచావో–అరాచకత హటావో’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు.
ఈ సభకు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు పాదయాత్ర మార్గంలోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.
గత రెండ్రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై అమిత్ షా ఈ సభలో స్పందించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారు? ప్రతిపక్షాలపై ఏయే అంశాలను ప్రస్తావిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.