- పంజాబ్‌లో ఆప్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా
- రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిక
- 2027 ఎన్నికలకు ముందు ఆప్‌కు ఎదురుదెబ్బ
- తొలి జాబితాలో టికెట్లు ప్రకటించకపోవడంతో ఎమ్మెల్యేల నిర్ణయం
- ఆప్ నాయకత్వంపై ఎమ్మెల్యేల విమర్శలు
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం ఆప్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం కొన్ని గంటల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు ఆదివారం పార్టీకి రాజీనామా చేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సోమవారం బీజేపీలో చేరారు.
అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్‌తో పాటు పటియాలా జిల్లాలోని సమనా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరమజ్రా, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా బీజేపీలో చేరిన వారిలో ఉన్నారు. దీంతో పంజాబ్‌లో ఆప్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ ఇటీవల 40 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో సమనా, సనౌర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఆ రెండు నియోజకవర్గాలకు పార్టీ కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించడంతో తమకు మళ్లీ టికెట్లు దక్కకపోవచ్చని భావించిన జౌరమజ్రా, పఠాన్‌మజ్రా పార్టీని వీడినట్లు వార్తలు వచ్చాయి.
పార్టీని వీడిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆప్ నాయకత్వంపై విమర్శలు చేశారు. ఢిల్లీ నాయకత్వం పంజాబ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్య, అప్పుల భారం, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు, పార్టీ నుంచి వెళ్లిపోయిన లేదా సస్పెండ్ అయిన నేతలను బీజేపీ చేర్చుకుంటోందని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా విమర్శించారు.