- రైతుల సమస్యలపై 2021లో చేసిన ధర్నాకు సంబంధించిన కేసు
- అమరనాథరెడ్డి సహా 29 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు
- చివరకు న్యాయమే గెలిచిందన్న అమరనాథ రెడ్డి
పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలకు భారీ ఊరట లభించింది. 2021లో శాంతిపురంలో రైతుల సమస్యలపై నిర్వహించిన ధర్నాకు సంబంధించి నమోదైన కేసును కుప్పం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సహా మొత్తం 29 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిర్దోషులుగా బయటపడ్డారు.
2021లో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ టీడీపీ నేతలు చేసిన ఆందోళనపై రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. ఇందులో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని ఏ-1 నిందితుడిగా చేర్చగా, పి. మనోహర్, పి.ఎస్. మునిరత్నం, గౌనివారి శ్రీనివాసులు వంటి మరికొందరు నేతలు కూడా నిందితులుగా ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి ఈరోజు తుది విచారణ జరగగా, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సహా ఇతర నేతలు కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం, కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్ష సాధింపుతోనే తమపై తప్పుడు కేసులు బనాయించారని, చివరకు న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.