- కాంగ్రెస్ ఏఐ ఫొటోలను పంచుకుందని రిజిజు విమర్శ
- రామలీలా మైదానం ర్యాలీపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
- సభకు 10 లక్షల మంది వస్తారని ముందుగా ప్రకటించిన కాంగ్రెస్
- మైదానంలో 40 శాతం ఖాళీగా ఉందని భాజపా ఆరోపణ
- ఏఐ ఫొటోతో ర్యాలీ జనసందోహాన్ని చూపించారని రిజిజు ఆరోపణ
ఢిల్లీ రామలీలా మైదానంలో విపక్ష కూటమి నిర్వహించిన భారీ ర్యాలీ ఇప్పుడు రాజకీయ విమర్శలకు వేదికగా మారింది. సభకు భారీగా జనం వచ్చారని చూపించేలా ఏఐతో రూపొందించిన ఫొటోలను కాంగ్రెస్ నేతలు పంచుకున్నారంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. ‘కనీసం నకిలీ ఫొటోనైనా సరిగ్గా తయారు చేయలేకపోయారు’ అంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దీంతో సభకు వచ్చిన జనంపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ర్యాలీకి 10 లక్షల మంది వస్తారని కాంగ్రెస్ ముందుగా ప్రకటించిందని భాజపా నేతలు గుర్తు చేశారు. అయితే, సభ జరిగిన సమయంలో మైదానంలో పెద్ద సంఖ్యలో కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. సుమారు 28 వేల కుర్చీల్లో 5 వేల నుంచి 7 వేల వరకు ఖాళీగా ఉన్నాయని భాజపా ఎంపీ సంబిత్ పాత్ర పేర్కొన్నారు. మైదానంలో 40 శాతం ఖాళీగా ఉందని కూడా ఆరోపించారు. ఈ లెక్కలను భాజపా తన వాదనకు ఆధారంగా చూపుతోంది.
సభకు భారీగా జనం హాజరయ్యారని చెప్పేందుకు కాంగ్రెస్ డ్రోన్ దృశ్యాలు, ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే, కాంగ్రెస్ నేతలు పంచుకున్న ఓ ఫొటో కృత్రిమ మేధతో రూపొందించిందంటూ విమర్శలు వచ్చాయి. అందులో రాహుల్, సోనియా గాంధీ కనిపిస్తున్న వేదిక అసలు సభా వేదికకు భిన్నంగా ఉందని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఈ ఫొటోపై రిజిజు విమర్శలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలో ఈ ర్యాలీ నిర్వహించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని విపక్ష నేతలు ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు అక్రమంగా జరిగాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం, భాజపా ఈ ఆరోపణలను ఖండించాయి.