- ముంబై విమానాశ్రయంలో రూ.3.05 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- పర్ఫ్యూమ్ సీసాల్లో లిక్విడ్ రూపంలో బంగారం రవాణా
- దేశంలో తొలిసారి వెలుగుచూసిన లిక్విడ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు
- ట్రోలీ బ్యాగులు, ఇయర్‌బడ్స్‌లోనూ దాచిపెట్టిన వైనం
- ఈ కేసుకు సంబంధించి 10 మంది ప్రయాణికులపై విచారణ
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు వినూత్న రీతిలో సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రయాణికులు ఎవరికీ అనుమానం రాకుండా పెర్ఫ్యూమ్ సీసాలలో ద్రవరూపంలో (లిక్విడ్ గోల్డ్) బంగారాన్ని దాచి తరలిస్తుండగా అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు.
నవంబర్ 28, 29 తేదీల్లో విదేశాల నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకున్న 10 మంది ప్రయాణికులను అధికారులు అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 2.9 కిలోల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో సుమారు రూ.3.05 కోట్లు ఉంటుందని కస్టమ్స్ విభాగం అంచనా వేసింది.
సాధారణంగా బంగారాన్ని బిస్కెట్లు, పేస్ట్ రూపంలో లేదా శరీర భాగాల్లో దాచి తరలించడం చూస్తుంటాం. అయితే, సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పర్ఫ్యూమ్లలో లిక్విడ్ బంగారాన్ని కలిపి స్మగ్లింగ్ చేయడం దేశంలోనే ఇది మొదటిసారని కస్టమ్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
నిందితులు కేవలం పెర్ఫ్యూమ్ బాటిళ్లలోనే కాకుండా ఇతర వస్తువుల్లోనూ బంగారాన్ని అత్యంత చాకచక్యంగా దాచిపెట్టారు. ట్రాలీ బ్యాగుల స్క్రూలు, బ్యాగుల చక్రాలు, ఎలక్ట్రికల్ వైర్లు, చివరికి ఇయర్‌బడ్స్ అంతర్గత విడిభాగాల్లో కూడా బంగారాన్ని అమర్చి తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరికి డెలివరీ చేసేందుకు తీసుకెళుతున్నారు అనే కోణంలో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.