- నాలుగేళ్లపాటు హింసించడం వల్లే బాలుడు మరణించాడని ఆరోపణలు
- మరో కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో దశాబ్దాల తర్వాత కేసులో పురోగతి
- కొడుకు మృతిపై పొంతనలేని సమాధానాలిస్తూ తప్పించుకున్న నిందితురాలు
- 92 ఏళ్ల వృద్ధురాలిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్న పోలీసులు
అమెరికాలో 57 ఏళ్ల కిందట జరిగిన ఓ దారుణ హత్యోదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఐదేళ్ల కన్నకొడుకును అత్యంత కిరాతకంగా హింసించి, హత్య చేసిన ఆరోపణలపై 92 ఏళ్ల వృద్ధురాలిని టెక్సాస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన యావత్ దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. హ్యారియట్ ఎవిలిన్ హాల్ (92) అనే మహిళ 1969లో టెక్సాస్‌లోని యూనివర్సల్ సిటీలో నివసించేది. ఆ సమయంలో ఆమె తన ఐదేళ్ల కుమారుడిని సుమారు నాలుగేళ్ల పాటు తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ బాలుడు కోమాలోకి వెళ్లి, 1969 నవంబర్ 25న మరణించాడు. ఆ సమయంలో హ్యారియట్ భర్త జేమ్స్ ఫ్లెచర్ హాల్, రాండోల్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో పనిచేసేవారు. ఆయన ఇప్పటికే మరణించారు.
దశాబ్దాలుగా ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, మృతుడి సోదరుడు జేమ్స్ రాండాల్ హాల్ ఈ కేసులో కీలక సాక్షిగా మారాడు. తన సోదరుడిపై జరిగిన హింసను తాను కళ్లారా చూశానని చెబుతూ, 2024లో పోలీసులకు కీలకమైన వివరాలు అందించాడు.
ఆయన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు, వాకో నగరంలో నివసిస్తున్న హ్యారియట్ను విచారించారు. విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. గతంలో బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడని చెప్పిన ఆమె, ఆ తర్వాత ఆ ఘటన గురించి తనకేమీ గుర్తులేదని చెప్పడం గమనార్హం.
జేమ్స్ రాండాల్ ఇచ్చిన సమాచారం, పాత రికార్డులను పరిశీలించిన పోలీసులు, హ్యారియట్ను బెక్సార్ కౌంటీలో అరెస్ట్ చేశారు. ఆమెకు 5 లక్షల డాలర్ల బాండ్ విధించారు. పోలీసులు విడుదల చేసిన మగ్షాట్లో ఆమె ఆరెంజ్ రంగు జంప్‌సూట్‌లో, మెడకు బ్రేస్ ధరించి కనిపించింది.
ఇదిలా ఉండగా, ఇటీవలే మిసిసిపీలో ఇలాంటి మరో దారుణ ఘటన జరిగింది. బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే ఆ శిశువును కొట్టి చంపిన ఆరోపణలపై జానెల్ షారన్ జోర్డాన్ (25) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టంలో శిశువు తలపై బలమైన గాయాలు కావడంతోనే మరణించిందని తేలడంతో, ఆమెను విచారించి అరెస్ట్ చేశారు.