- సాత్విక పెద్ద స్టార్ అవుతుందని జోస్యం చెప్పిన జక్కన్న
- శ్రీదేవి, జయప్రద సరసన తెలుగు అమ్మాయిని చూడాలన్నది తన కోరిక అని వెల్లడి
- భారత చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయికి వెళ్తావంటూ సాత్వికకు భరోసా
- సినిమాను దుల్కర్ సల్మాన్ తన భుజాలపై మోశారని ప్రశంస
- దర్శకుడు పవన్ సాదినేని కృషిని మెచ్చుకున్న రాజమౌళి
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నూతన నటి సాత్విక వీరవల్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె భారత చిత్ర పరిశ్రమలో కచ్చితంగా పెద్ద స్టార్ అవుతుందని జోస్యం చెప్పారు. పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాతోనే సాత్విక కథానాయికగా పరిచయమైంది.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. "తెలుగు ప్రేక్షకులు ఏ భాషా నటినైనా ఆదరిస్తారు. కానీ, మనసులో ఎక్కడో ఒకచోట ఓ తెలుగు అమ్మాయి పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటాం. శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి గొప్ప నటీమణులను మనం చూశాం. మళ్లీ ఆ స్థాయికి చేరే మరో తెలుగు నటి రావాలని ఆశిస్తాం. ఇప్పుడు సాత్విక వీరవల్లి వచ్చింది" అని అన్నారు.
సాత్విక వైపు చూస్తూ, "నువ్వు భారత చిత్ర పరిశ్రమలో చాలా పెద్ద స్టార్ అవుతావు, అందులో సందేహం లేదు! మా కోసం త్వరగా తెలుగు నేర్చుకో" అని ఆయన సూచించారు.
‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని మనసును హత్తుకునే సినిమాగా అభివర్ణించారు. దుల్కర్ సల్మాన్ ప్రమేయం లేకుండా ఈ సినిమా ఇంతగా ప్రేక్షకులకు చేరేది కాదని, ఆయన తన భుజాలపై సినిమాను మోశారని కొనియాడారు. దర్శకుడు పవన్ సాదినేని కృషిని, గుణ్ణం గంగరాజు అందించిన సంభాషణలు, స్క్రీన్‌ప్లేను జక్కన్న ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. చిత్రంలోని శ్రుతి హాసన్, రుహానీ శర్మ, ఇతర నటీనటుల నటనను కూడా రాజమౌళి ప్రశంసించారు. పాన్ ఇండియా దర్శకుడి నుంచి వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.