- డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ పార్టీ వైఖరిపై వీడని సస్పెన్స్
- పార్టీలో చీలికను ఆపడానికేనని కాంగ్రెస్‌తో పవార్ అన్నట్లు సమాచారం
- బిల్లు ముసాయిదా చూశాకే నిర్ణయమంటున్న సుప్రియా సూలే
- కేంద్ర, రాష్ట్ర కేబినెట్ పదవుల ప్రచారంపై సందిగ్ధత
- నాడు రాజ్యసభకు అండగా నిలిచామంటూ కాంగ్రెస్ ప్రశ్నలు
దేశ రాజకీయాల్లో చాణక్యుడిగా గుర్తింపు పొందిన శరద్ పవార్ నిర్ణయాలు ఎప్పుడూ ఊహకందని మలుపులు తిరుగుతుంటాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కేంద్రంగా ఆయన వేస్తున్న అడుగులు మరోసారి తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. నిన్నటివరకు విపక్ష ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఆయన, తాజా పరిణామాలతో ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఢిల్లీ వర్గాల్లో పెద్ద చిక్కుముడిగా మారింది. కాంగ్రెస్‌తో బంధాన్ని కొనసాగిస్తారా లేక పరిస్థితుల ప్రభావంతో ఎన్డీయే వైపు అడుగులు వేస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది.
కాంగ్రెస్‌కు పవార్ ఫోన్..
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 85 ఏళ్ల శరద్ పవార్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో స్వయంగా మాట్లాడినట్లు సమాచారం. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం తన పార్టీ మనుగడకు అత్యంత కీలకమని, దీన్ని వ్యతిరేకిస్తే పార్టీలో మరో చీలిక వచ్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తన ముందున్న పరిస్థితులను ఒక ‘అనివార్యత’గా కాంగ్రెస్‌కు వివరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నియోజకవర్గాల విభజన అవసరమని పవార్ గతంలోనే చెప్పారని సీనియర్ నేత జితేంద్ర గుర్తుచేస్తున్నారు. బిల్లు పూర్తి వివరాలు చూశాక, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనుకూలంగా ఉంటే మద్దతు ఇచ్చే ఆలోచన చేస్తామని సుప్రియా సూలే కూడా పేర్కొన్నారు.
కేంద్రంలో మంత్రి పదవి?
బిల్లుకు మద్దతు ఇవ్వాల్సి వస్తే అధికార పంపకాలపై స్పష్టత ఉండాలని పవార్ పార్టీలోని ఓ వర్గం భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర కేబినెట్లో సుప్రియా సూలేకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ జయంత్ పాటిల్, జితేంద్రకు కేబినెట్ స్థానాలతో పాటు మరో రెండు సహాయ మంత్రి పదవులు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సుప్రియా సూలే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారనే వాదనలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. అసెంబ్లీలో తమకు ఉన్నది కేవలం పది మంది ఎమ్మెల్యేలే అయినప్పుడు ఆ వాదనల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.
నాడు అండగా నిలిచాం.. కాంగ్రెస్ ఆవేదన
పవార్ పార్టీ వైఖరిపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ఈ బిల్లును వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. గత మార్చిలో పవార్ పార్టీకి కేవలం 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఏమాత్రం ఆలోచించకుండా మద్దతు ఇచ్చి పవార్‌ను రాజ్యసభకు పంపారని మహారాష్ట్ర కాంగ్రెస్ గుర్తుచేస్తోంది. విపక్షాల ఐక్యత ఎంతో కీలకమైన ఈ సమయంలో పవార్ పార్టీ తీసుకునే నిర్ణయం కూటమి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
పార్లమెంట్లో నంబర్ గేమ్.. పవార్ పార్టీ ఎంపీలే కీలకం
ఏప్రిల్‌లో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లేక వీగిపోయిన ఈ బిల్లును ఈసారి ఎలాగైనా నెగ్గించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. లోక్‌సభలో పూర్తి హాజరు ఉంటే 360 మంది సభ్యుల ఆమోదం అవసరం. ప్రస్తుతం ఎన్డీయే బలం మిత్రపక్షాలతో కలిపి 319గా ఉంది. ఈ పరిస్థితుల్లో పవార్ పార్టీకి చెందిన ఎనిమిది మంది లోక్‌సభ ఎంపీల మద్దతు ప్రభుత్వానికి ఎంతో విలువైనదిగా మారింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పవార్ పార్టీ పార్లమెంట్ వేదికగా ఏ వైపు నిలబడుతుందో తేలనుంది.