- అనంతపురంలో విద్యుత్ స్తంభంపై కరెంట్ షాక్‌కు గురైన కార్మికుడు
- అపస్మారక స్థితిలో ఉన్న ఉద్యోగికి స్తంభంపైనే సీపీఆర్
- సమయస్ఫూర్తితో ప్రాణాలు నిలిపిన వ్యక్తి
- ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన నెట్టింట వీడియో వైరల్
అనంతపురం జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తూ కరెంట్ షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ కార్మికుడిని ఓ వ్యక్తి అదే స్తంభంపైకి ఎక్కి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. కంబదూరు మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది. రాజు అనే ప్రైవేట్ విద్యుత్ కార్మికుడు మరమ్మతుల కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు. పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో స్పృహ కోల్పోయి తీగల మధ్య స్తంభంపైనే వేలాడుతూ ఉండిపోయాడు. కింద ఉన్న స్థానికులకు ఆ సమయంలో ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోయారు.
వారిలో ఓ వ్యక్తి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. అనంతరం వేగంగా స్తంభంపైకి ఎక్కి, వేలాడుతున్న రాజుకు అంత ఎత్తులోనే సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. అతని ప్రయత్నం ఫలించి రాజులో తిరిగి కదలిక వచ్చింది. వెంటనే రాజును సురక్షితంగా కిందకు దించి, మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఉద్యోగిని కాపాడిన వ్యక్తి సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.