- ఇరుదేశాల దీర్ఘకాల సమస్యలు పరిష్కార దిశగా అడుగులు
- 2026 సమ్మిట్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
- ఈయూతో ఒప్పందం కూడా వచ్చే ఏడాది నుంచే అమలు
- అమెరికా ప్రతిపాదించిన 25 శాతం సుంకాల వేళ కీలక ప్రకటన
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఒప్పంద విధివిధానాలు, అమలు ప్రక్రియలో ఇన్నాళ్లూ ఎదురైన అడ్డంకులు తొలగిపోతున్నాయని చెప్పారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ‘ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సమ్మిట్ 2026’ సదస్సులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం అతి త్వరలోనే ఒక కొలిక్కి రానుందని గోయల్ స్పష్టం చేశారు. చర్చల్లో కీలకమైన ముందడుగు పడిందని తెలిపారు. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం సిద్ధమవుతోందని వివరించారు.
భారత ఆర్థిక ప్రగతిని గోయల్ కొనియాడారు. జీఎస్టీ వ్యవస్థను సులభతరం చేస్తూనే పన్ను రేట్లను అందుబాటులో ఉంచామని గుర్తుచేశారు. ఇటీవల జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేశాయని చెప్పారు. ఒకే నెలలో ఎగుమతులు 90 బిలియన్ డాలర్లకు చేరడం దేశ చరిత్రలోనే ఓ మైలురాయి అని పేర్కొన్నారు.
యూరోపియన్ యూనియన్‌తో కూడా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగింపునకు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి యూరోపియన్ యూనియన్ ఒప్పందం ఖరారవుతుందని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి అది అమల్లోకి వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఈ ఒప్పందాల ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అవకాశాలు దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు.
భారత వస్తువులపై 25 శాతం వరకు సుంకాలు విధించాలని అమెరికా వాణిజ్య విభాగం ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే ఆ సుంకాలను 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా సంకేతాలిచ్చింది. భారత్ తయారీ రంగంలో మితిమీరిన సామర్థ్యం ఉందన్న ఆరోపణలను కేంద్రం ఇప్పటికే తోసిపుచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఏడు నెలల్లో అమెరికాకు భారత ఎగుమతులు 59.52 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇప్పటికీ అమెరికానే భారత్‌కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా కొనసాగుతోంది.