- యూపీఎస్‌సీ నుంచి ఎన్‌డీఏ 1 2027 షార్ట్ నోటిఫికేషన్ విడుదల
- డిసెంబర్ 2 నుంచి 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
- ఇంటర్ అర్హతతో అవివాహిత యువతీయువకులు అర్హులు
- 2027 ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా రాత పరీక్ష నిర్వహణ
- రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
దేశ రక్షణ దళాల్లో చేరి సేవ చేయాలనుకునే యువతీయువకులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) శుభవార్త చెప్పింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లలో 2027 సంవత్సరానికి గాను మొదటి విడత ప్రవేశాల కోసం షార్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల్లో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
పూర్తిస్థాయి నోటిఫికేషన్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 22, 2026లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు.
విద్యార్హతలు, ఇతర వివరాలు
ఎన్‌డీఏలోని ఆర్మీ విభాగానికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి లేదా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నా అర్హులే. అయితే, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఇండియన్ నేవల్ అకాడమీకి మాత్రం ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ (ఎంపీసీ) తప్పనిసరిగా చదివి ఉండాలి.
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొత్తం మూడు దశల్లో జరుగుతుంది.
1. రాత పరీక్ష: మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను 2027 ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
2. ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 900 మార్కులకు సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది.
3. వైద్య పరీక్షలు: ఇంటర్వ్యూలోనూ ఉత్తీర్ణులైన వారికి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం వైద్య పరీక్షలు చేపడతారు. ఈ మూడు దశల్లో ప్రతిభ కనబరిచిన వారిని మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు, ముఖ్య తేదీలు
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.100గా నిర్ణయించారు. మహిళా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. ఆసక్తిగల అభ్యర్థులు డిసెంబర్ 2న విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌లో వయోపరిమితి, సిలబస్, పరీక్షా కేంద్రాలు వంటి పూర్తి వివరాలను పరిశీలించి, యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
UPSC Official Website