- రాజస్థాన్లోని అల్వార్ జిల్లా హర్సోలీ గ్రామంలో జరిగిన ప్రీతి వివాహం
- తోటి జవాన్ కుటుంబానికి సొంత అన్నదమ్ముల్లా అండగా నిలిచిన సైనికులు
- పెళ్లి ఖర్చుల కోసం రూ. 1.61 లక్షల నగదు బహుమతిగా సమర్పణ
- ప్రీతి తల్లి అనితా దేవిని సభలో శాలువాతో సత్కరించిన రెజిమెంట్ సభ్యులు
- సైనికుల ఆత్మీయతను చూసి కంటతడి పెట్టిన గ్రామస్థులు, బంధువులు
కన్న కూతురి పెళ్లి వేళ పక్కన నిలబడి ఆశీర్వదించాల్సిన తండ్రి లేకపోతే ఆ లోటును ఎవరూ పూడ్చలేరు. పెళ్లి పీటలపై కూర్చున్న ప్రీతి మనసులోనూ సరిగ్గా అదే వేదన మెదిలింది. కానీ, ఆ శుభకార్యంలో ఆమె తండ్రి లేని లోటు కనిపించకుండా ఒక అద్భుతం జరిగింది. దేశ రక్షణలో తన తండ్రితో కలిసి సరిహద్దుల్లో తుపాకులు పట్టిన సైనిక సోదరులు ఆ పెళ్లికి తరలివచ్చారు. కేవలం తోటి ఉద్యోగులుగానో, అతిథులుగానో కాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా, అన్నదమ్ముల్లా వచ్చి నిలబడి పెళ్లిని ఘనంగా జరిపించారు.
రాజస్థాన్లోని అల్వార్ జిల్లా హర్సోలీ గ్రామంలో శనివారం ఈ మనసును కదిలించే దృశ్యం ఆవిష్కృతమైంది. దివంగత హవల్దార్ పప్పల్ సింగ్ గతంలో 16వ జాట్ రెజిమెంట్లో సేవలందించారు. ఆయన భౌతికంగా దూరమైనా, ఆయన కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించిన ఆ రెజిమెంట్ సైనికులు, జూనియర్ కమిషన్డ్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో ప్రీతి వివాహానికి హాజరయ్యారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం తమ వంతుగా రూ. 1.61 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా, యూనిట్ తరఫున రోష్ని ధావల్ ప్రీతి తల్లి అనితా దేవికి శాలువా కప్పి, అందరి సమక్షంలో సముచితంగా గౌరవించిన తీరు చూపరులను భావోద్వేగాలకు గురిచేసింది.
సుబేదార్ వీరేంద్ర కుమార్ ధావల్, నాయిబ్ సుబేదార్ సుబే సింగ్, హవల్దార్ సతీష్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్, నాయక్ లోకేష్, నాయక్ సోహన్ సింగ్, అగ్నివీర్ దివాకర్లతో పాటు పలువురు జవాన్లు దగ్గరుండి పెళ్లి పనులను చూసుకున్నారు. తోటి సైనికుడు లేకపోయినా ఆయన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్న ఆ జవాన్ల ఔదార్యాన్ని చూసి గ్రామస్థులు, పెళ్లికొడుకు తరఫు బంధువులు చేతులెత్తి మొక్కుతూ ప్రశంసలు కురిపించారు. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పెనవేసుకున్న ఆ సైనిక బంధం ఎంతటి పవిత్రమైనదో, 'సేవా పరమో ధర్మః' అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.