- తిరునెల్వేలిలో త్రిష పేరుతో నూతన వేదిక ఏర్పాటు
- ‘ఇళయ పురట్చి తలైవి’గా త్రిషకు అభిమానుల అభివర్ణన
- సీఎం విజయ్‌తో కలిసి పనిచేయాలంటూ అభిమానుల విజ్ఞప్తి
- సేవా కార్యక్రమాల కోసమేనంటున్న నిర్వహణ కమిటీ
- రాజకీయ వార్తలపై ఎలాంటి ప్రకటన చేయని నటి త్రిష
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ రాజకీయ అరంగేట్రంపై తమిళనాడులో సరికొత్త చర్చ మొదలైంది. త్రిష పేరిట అభిమానులు ప్రత్యేక వేదికను ప్రారంభించి, అధికారిక లోగోను ఆవిష్కరించడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తిరునెల్వేలిలో సమన్వయకర్త రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ (యువ విప్లవ నేత త్రిష వేదిక) పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితను ప్రజలు ‘పురట్చి తలైవి’ అని పిలిచేవారు. ఇప్పుడు అదే తరహాలో త్రిషకు ‘ఇళయ పురట్చి తలైవి’ అనే బిరుదును అభిమానులు ఆపాదించారు. జయలలితకు ఉన్న ప్రజా ఆదరణ, ధైర్యం త్రిషలో కూడా కనిపిస్తున్నాయని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి త్రిష రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే మరోవైపు, తమది ఎలాంటి పదవులు ఆశించని సేవా సంస్థ మాత్రమేనని కూడా వారు వెల్లడించడం గమనార్హం. గతంలో విజయ్ అభిమాన సంఘాలే రాజకీయ పార్టీ ఏర్పాటుకు పునాదిగా మారడం, ఇటీవలే నటుడు ధనుష్ అభిమాన సంఘాలు సైతం సంక్షేమ సంస్థగా మారిన నేపథ్యంలో త్రిష అభిమానుల తీరు కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.