- కుటుంబ కష్టాల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు.. యశ్ గార్గ్ స్ఫూర్తిదాయక ప్రయాణం
- ఫ్లాట్ నిర్మాణాలు ఆగిపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకున్న తల్లిదండ్రులు
- ఖర్చులు తగ్గించుకుని గూగుల్ ఉద్యోగం చేస్తూనే సైడ్ బిజినెస్.. యశ్ గార్గ్ కు రూ. 2 కోట్ల ఆదాయం
- 2023 జూన్ నాటికి అప్పులన్నీ చెల్లించి గూగుల్ ఉద్యోగానికి రాజీనామా
- సొంత ఏఐ స్టార్టప్ కోసం 4 లక్షల డాలర్ల నిధులు సమీకరించిన యశ్ గార్గ్
జీవితంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైనా పట్టుదల, ప్రణాళిక ఉంటే అద్భుతాలు సాధించవచ్చని ఐఐటీ దిల్లీ పూర్వ విద్యార్థి యశ్ గార్గ్ నిరూపించారు. తన కుటుంబంపై ఉన్న రూ. 1 కోటికి పైగా అప్పును కేవలం 25 ఏళ్ల వయస్సులోనే పూర్తిగా తీర్చివేయడమే కాకుండా, ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో విజయవంతమైన స్టార్టప్‌ను నిర్మించారు. ఈ మేరకు ఆయన తన ప్రయాణాన్ని వివరిస్తూ లింక్డ్ఇన్లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతోంది.
అప్పుల ఊబిలోకి కుటుంబం
యశ్ గార్గ్ తల్లిదండ్రులు గతంలో నిర్మాణంలో ఉన్న కొన్ని ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టారు. అయితే ఆ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో ఫ్లాట్లు చేతికి రాలేదు. మరోవైపు బ్యాంకులకు హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది. దాంతో బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేయడంతో పాటు క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తొలుత యశ్ నుంచి దాచినప్పటికీ, ఆయన ఐఐటీ దిల్లీలో రెండో సంవత్సరం చదువుతున్న సమయంలో రికవరీ ఏజెంట్లు ఇంటికి రావడం మొదలైంది. దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న యశ్, అన్ని బకాయిలను లెక్కించగా అసలే రూ. కోటి దాటినట్లు తేలింది. అప్పటివరకు చదువు పూర్తికాగానే స్టార్టప్ పెట్టాలనుకున్న ఆయన, ఆ ఆలోచనను పక్కనపెట్టి కుటుంబ అప్పులు తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఉద్యోగ ప్రస్థానం.. కఠిన పొదుపు
కాలేజీలో 9.7 సీజీపీఏతో మెరిట్ విద్యార్థిగా నిలిచిన యశ్, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా కోహెసిటీ (Cohesity) కంపెనీలో ఏడాదికి రూ. 18 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. బెంగళూరుకు మకాం మార్చి, నెలకు రూ. 20,000 లోపే ఖర్చు చేసుకుంటూ మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవారు. అయితే, ఆ జీతం కేవలం బ్యాంకు వడ్డీలకే సరిపోతోందని, అసలు తగ్గడం లేదని ఆయన గుర్తించారు. మరింత మెరుగైన సంపాదన కోసం కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుని, కొద్దికాలం స్పాట్నానా సంస్థలో పనిచేసి, ఆ తర్వాత గూగుల్ సెర్చ్ టీమ్‌లో ఇంజినీర్‌గా చేరారు. అప్పటికి కూడా ఇంకా దాదాపు రూ. 80 లక్షల అప్పు అలాగే మిగిలి ఉంది.
మలుపు తిప్పిన మొబైల్ గేమింగ్ బిజినెస్
గూగుల్ అనుమతితో యశ్ తన తండ్రితో కలిసి రాత్రిళ్లు, వారాంతాల్లో మొబైల్ యాప్స్ తయారు చేయడం ప్రారంభించారు. ఆండ్రాయిడ్‌లో సరైన స్పందన రాకపోవడంతో, ప్లాట్‌ఫామ్ తీరును లోతుగా అధ్యయనం చేసి రూ. 2.1 లక్షలతో మ్యాక్‌బుక్ ప్రో కొనుగోలు చేశారు. కేవలం ఆరు రోజుల్లోనే తమ గేమ్‌ను ఐఓఎస్ (iOS) ప్లాట్‌ఫామ్‌కు అనుగుణంగా మార్చి లాంచ్ చేశారు. ఆ గేమ్ అతి తక్కువ సమయంలోనే విశేష ఆదరణ పొందింది. దాదాపు 1.5 సంవత్సరాలలో 2 లక్షలకు పైగా డౌన్లోడ్లు నమోదు కావడంతో పాటు రూ. 2 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గూగుల్ జీతం, గేమ్స్ ద్వారా వచ్చిన రాబడిని జోడించి అసలును వేగంగా చెల్లించారు. చివరికి 2023 జూన్‌లో కుటుంబంపై ఉన్న చివరి లోన్‌ను కూడా పూర్తిగా చెల్లించేశారు. తన 25వ పుట్టినరోజుకు సరిగ్గా ఒక్క రోజు ముందు గూగుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి, అప్పులు లేని స్వేచ్ఛా జీవితంలోకి అడుగుపెట్టారు.
సాస్ నుంచి ఏఐ స్టార్టప్ వైపు అడుగులు
యాపిల్ ప్రైవసీ పాలసీ మార్పుల వల్ల గేమింగ్ వ్యాపారాన్ని మూసివేసిన యశ్, ఆ తర్వాత సాస్ (SaaS) రంగంపై దృష్టి సారించారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కోసం 'సూపర్ వర్క్‌డే' పేరిట యాప్స్ రూపొందించారు. సుమారు 8 నెలల పాటు ఎలాంటి ఆదాయం లేకపోయినా పట్టువదలకుండా ప్రయత్నించి 2024 ఏప్రిల్ నుంచి మంచి పురోగతి సాధించారు. 300 మందికి పైగా చెల్లింపు వినియోగదారులను సంపాదించి, ఏడాదికి దాదాపు 1,00,000 డాలర్ల ఆదాయాన్ని అందుకున్నారు. ఈ సంపాదనతోనే తన సోదరి వివాహాన్ని కూడా ఘనంగా జరిపించారు.
ఆర్థికంగా స్థిరపడిన తర్వాత, యశ్ తాను ఎప్పటినుంచో స్థాపించాలనుకున్న 'ఏఐ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్' స్టార్టప్‌ను ప్రారంభించారు. 2025 జనవరిలో సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ 'సౌత్ పార్క్ కామన్స్', ఆయన స్టార్టప్‌కు 5.7 మిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌తో 4,00,000 డాలర్ల (దాదాపు రూ. 3.3 కోట్లు) నిధులను సమకూర్చింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని యశ్ గార్గ్ తన పోస్ట్ ద్వారా యువతకు సందేశమిచ్చారు.