- 'ఇఫీ' వేదికపై 'భక్త కన్నప్ప' ప్రదర్శన
- పెదనాన్న కృష్ణంరాజు సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్
- హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ‘ఫౌజీ’
- వచ్చే ఏడాది మార్చి 19న ‘ఫౌజీ’ సినిమా విడుదల
ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని కథలు ఎప్పటికీ నిలిచిపోతాయని అగ్ర కథానాయకుడు ప్రభాస్ అన్నారు. తన పెదనాన్న కృష్ణంరాజు నటించిన క్లాసిక్ చిత్రం ‘భక్త కన్నప్ప’కు 57వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) అరుదైన గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రం 'ఇఫీ'లో ప్రదర్శితం కావడంపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు.
"నేను చూస్తూ పెరిగిన సినిమా ఇది. పెదనాన్న నటించి, గోపీకృష్ణ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి బాపు గారు ప్రాణం పోశారు. ఏళ్లు గడిచినా కొన్ని కథలు నిత్యనూతనంగా ఉంటాయి. ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని ఇఫీలో వేడుకగా జరుపుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఇది ఒక అందమైన వారసత్వం, నిజమైన గౌరవం" అని ప్రభాస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ క్లాసిక్ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా దీన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇక, ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఫౌజీ' ఒకటి. ఈ చిత్రం టీజర్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, హిట్లర్ మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి రేపుతోంది.
భారతీయుల రక్తంలో బానిసత్వం ఉందని హిట్లర్ అనగా, ‘ఫౌజీ’ అనే భారత గూఢచారి పరాక్రమాన్ని నేతాజీ ఉదాహరణగా చూపుతారు. భగవద్గీత ఆధారంగా అతడు సృష్టించిన కోడ్‌ను ఛేదించడం బ్రిటిష్ వారికి కూడా సాధ్యం కాలేదని వివరిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.