- డీపీఐఎఫ్ఎఫ్ 2026 అవార్డుల జాబితా అధికారిక ప్రకటన
- ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా టేలర్ స్విఫ్ట్
- ఉత్తమ కమెడియన్‌గా ఎంపికైన భారత సమయ్ రైనా
- ఉత్తమ చిత్రంగా 'ధురంధర్', నటుడిగా రణ్వీర్ సింగ్
- జేమ్స్ కామెరాన్, కమల్ హాసన్‌లకు విశిష్ట గౌరవ పురస్కారాలు
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ (డీపీఐఎఫ్ఎఫ్) 2026 విజేతల జాబితాను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 20న తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఈ జాబితాలో దేశీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు చోటు దక్కించుకున్నాడు. పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ అంతర్జాతీయ కళాకారిణిగా నిలవగా, భారతీయ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా ఉత్తమ హాస్యనటుడి అవార్డును కైవసం చేసుకున్నాడు.
సినిమా విభాగంలో 'ధురంధర్' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అందులో నటనకు గానూ రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నాడు. ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడి పురస్కారాన్ని దక్కించుకున్నాడు. 'సైయారా' చిత్రంలో నటనకు అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలిచింది. అదే సినిమాలోని 'సైయారా' పాటకు ఉత్తమ గీతం అవార్డు లభించింది. కమల్ హాసన్ భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గానూ విశిష్ట పురస్కారాన్ని పొందగా, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత రంగానికి చేసిన విశేష కృషికి అవార్డు అందుకున్నారు.
గ్లోబల్ సినిమాలో అద్భుతమైన కృషికి గాను హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పురస్కారం సాధించాడు. 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. 'సిన్నర్స్' చిత్రంలో నటనకు మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. డిజిటల్ విభాగంలో 'ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్‌కు ఆర్యన్ ఖాన్ ఉత్తమ దర్శకుడి అవార్డు పొందాడు. సీనియర్ నటి స్మృతి ఇరానీ, అక్షయ్ ఖన్నాలు తమ నటనకు ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డులను ఏటా ప్రైవేట్ సంస్థ అందజేస్తోంది.