- భారత్ అండర్-19 ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆర్యవీర్ సెహ్వాగ్
- టోర్నీలో 361 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచిన యువ ఓపెనర్
- భారీ పరుగులు చేస్తేనే గౌరవం దక్కుతుందని కొడుకుకు చెప్పానన్న మాజీ డాషింగ్ ఓపెనర్
ప్రముఖుల సంతానం అనే కారణంతో ఎదురయ్యే విమర్శలను ఎవరూ ఆపలేరని, అయితే మైదానంలో భారీ పరుగులు సాధించడం ద్వారానే తన కుమారుడు ఆర్యవీర్ క్రికెట్ ప్రపంచంలో తగిన గౌరవాన్ని సంపాదించుకున్నాడని భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవల ఒమన్‌లో జరిగిన ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్‌ను భారత్ కైవసం చేసుకోవడంలో ఆర్యవీర్ సెహ్వాగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ... తన కుమారుడి ప్రతిభపై హర్షం వ్యక్తం చేశాడు. "భారత్ ఆసియా అండర్-19 ట్రోఫీ సాధించడంలో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో ఆర్యవీర్ రాణించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అతడు కేవలం పరుగులు చేయడమే కాకుండా, భారీ స్కోర్లు సాధించాడు. క్రికెట్‌లో గౌరవం దక్కాలంటే పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందేనని నేను ఎప్పుడూ వాడితో చెబుతుండేవాడిని. ఈ టోర్నీలో ఆర్యవీర్ అదే చేసి చూపించాడు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
ఇంటిపేరు చూసి విమర్శించే వారికి మైదానంలో ఆటతీరుతోనే సమాధానం చెప్పాలని, ఇప్పుడు ఆర్యవీర్ తన ప్రతిభను ప్రపంచానికి చాటాడని వీరూ వ్యాఖ్యానించాడు. తన కుమారుడు భవిష్యత్తులో కూడా దేశ ప్రజల ప్రేమాభిమానాలను పొందుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ టోర్నమెంట్‌లో ఆర్యవీర్ సెహ్వాగ్ 5 మ్యాచ్ లలో 90.25 సగటుతో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 361 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో పాకిస్థాన్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ఒక వికెట్ తేడాతో చివరి బంతికి ఛేదించి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి అండర్-19 ఆసియా కప్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆర్యవీర్ 58 పరుగుల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు.