- పదేళ్ల తర్వాత పేదలకు ఇంటి పట్టాల పంపిణీకి నిర్ణయం
- ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులకు ప్రయోజనం
- రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల కుటుంబాలకు అందనున్న ఒరిజినల్ పత్రాలు
- అసలు డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వాలని కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు
తెలంగాణలోని పేద, మధ్యతరగతి వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్ద కాలంగా తమ ఇంటి అసలు పత్రాల కోసం నిరీక్షిస్తున్న సుమారు 7 లక్షల కుటుంబాలకు ఊరటనిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప, వాంబే వంటి పాత గృహ నిర్మాణ పథకాల ద్వారా ఇళ్లు పొందిన లబ్ధిదారులకు వారి ఒరిజినల్ ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అందజేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో, 2014 కంటే ముందు అమలైన పలు పథకాల కింద ప్రభుత్వం పేదలకు ఇళ్లను మంజూరు చేసింది. లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణాల కలయికతో గృహ నిర్మాణాలు చేపట్టగా, ఆ సమయంలో అసలు పత్రాలను అధికారులు రుణాలకు హామీగా (తనఖా) తీసుకున్నారు. అయితే, రుణాలు పూర్తిగా చెల్లించినప్పటికీ చాలామంది లబ్ధిదారులకు ఆ పత్రాలు తిరిగి అందలేదు. ఫలితంగా సదరు ఇళ్లను విక్రయించుకోవాలన్నా, ఇతర రుణాలు పొందాలన్నా లేదా వారసత్వ బదిలీలు చేపట్టాలన్నా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల సెక్షన్ 22ఏ భూములపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ అంశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. వేలాది పట్టాలు ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాల్లోనే మూలుగుతున్నట్లు గుర్తించిన సీఎం అర్హులైన లబ్ధిదారులందరికీ వాటిని వెంటనే అప్పగించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, సంబంధిత లబ్ధిదారులను గుర్తించి వారి పత్రాలను అందజేసే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. పత్రాల పంపిణీకి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పదేళ్లుగా నిరీక్షిస్తున్న లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.