- తమిళంలో రూపొందిన 'అన్బిల్ అవన్'
- ప్రధాన పాత్రల్లో అశోక్ సెల్వన్ - ప్రీతీ ముకుందన్
- అక్టోబర్లో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 20వ తేదీ నుంచి 'సోనీలివ్'లో స్ట్రీమింగ్
- 5 భాషల్లో అందుబాటులోకి వస్తున్న కంటెంట్
ఓటీటీ ట్రాక్ పైకి అడుగుపెట్టడానికి ఒక తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమవుతోంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన సినిమాలను చూడటానికి యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ తో థ్రిల్ చేసే ఈ తరహా సినిమాలకు ఓటీటీలలో విశేషమైన ఆదరణ లభిస్తూ ఉంటుంది. అందువల్లనే ఈ తరహా కంటెంట్ ను ఆవిష్కరించడానికి ఓటీటీ సెంటర్లు పోటీపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో 'సోనీ లివ్' ద్వారా పలకరించబోతున్న సినిమానే 'అన్బిల్ అవన్'.
కరుణ మూర్తి - అభినయ సెల్వన్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. అశోక్ సెల్వన్ - ప్రీతిముకుందన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రేవతి .. ఢిల్లీ గణేశ్ .. కదిర్ బాలు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి నుంచి 5 భాషల్లో 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
సూర్య .. ఇయల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ సరదాగా గడపాలని అనుకుంటారు. అందుకోసం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, హిల్ స్టేషన్ లో ఒక ఖరీదైన ఇంటిని సూర్య కొనుగోలు చేస్తాడు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళతారు. ఆ ఇల్లు .. ఆ పరిసరాలు చూసి ఇయల్ సంబరపడిపోతుంది. అయితే ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. తాము చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నామనే విషయం అర్థం కావడానికి వాళ్లకి కాస్త సమయం పడుతుంది. ఆ ప్రమాదం ఏమిటి? ఆ ఇంటిని .. భార్యను రక్షించుకోవడం కోసం సూర్య ఏం చేయవలసి వస్తుంది? అనేదే కథ.