- నెలకు రూ.360 చెల్లించే స్థానంలో ఏడాది మొత్తానికి రూ.1500 మాత్రమే నిర్ణయం
- వార్షిక పాస్ తీసుకోవడం ద్వారా స్థానికులకు ప్రతి ఏటా రూ.2,820 వరకు ఆదా
- నవంబరు 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలు
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. టోల్ గేట్లకు 20 కిలోమీటర్ల పరిధిలో నివాసముండే సొంత (నాన్-కమర్షియల్) వాహనదారుల కోసం ప్రత్యేకంగా రాయితీతో కూడిన ‘వార్షిక లోకల్ పాస్’ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోని టోల్ గేట్ల వద్ద ఈ నూతన విధానం నవంబరు 1 నుంచే అమల్లోకి వచ్చింది.
ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద స్థానిక వాహనదారులకు నెలకు రూ.360 చొప్పున లోకల్ పాస్ ఇస్తున్నారు. దీని ప్రకారం ఏడాదికి రూ.4,320 ఖర్చవుతోంది. అయితే స్థానికుల ప్రయోజనార్థం ఏడాది కాలానికి కలిపి వార్షిక పాస్ ధరను కేంద్రం రూ.1500గా ఖరారు చేసింది. మున్సిపల్ పరిధి వెలుపల ఉండే టోల్ ప్లాజాలకు రూ.1500, మున్సిపల్ లేదా పట్టణ పరిధిలోని టోల్‌ప్లాజాలకు ఏడాదికి రూ.3000 రుసుముగా నిర్ణయించారు. గ్రామీణ, వెలుపలి ప్రాంతాల్లోని వారు వార్షిక లోకల్‌పాస్ తీసుకుంటే ఏటా రూ.2,820 వరకు ఆదా అవుతాయి.
వ్యక్తిగత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉన్నవారు ఒక నిర్దేశిత టోల్‌ప్లాజా వద్ద అపరిమిత రాకపోకల కోసం ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. అర్హులైన స్థానికులు సంబంధిత టోల్‌ప్లాజాల వద్ద నేరుగా ఈ పాస్ తీసుకోవచ్చు. అలాగే డిసెంబరు 1 నుంచి ‘రాజ్‌మార్గ్‌యాత్ర’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు.
ఈ అవకాశాన్ని టోల్‌ప్లాజా సమీపంలోని ప్రజలు వినియోగించుకోవాలని, వారి కోసమే కేంద్ర ప్రభుత్వం వార్షిక లోకల్‌పాస్‌ను అమలు చేస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. నిత్యం పనులు, వ్యాపారాల నిమిత్తం టోల్ గేట్ల మీదుగా రాకపోకలు సాగించే స్థానికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ వెసులుబాటు కల్పించింది.