- పదో తరగతి బాలిక కడుపులో 750 గ్రాముల వెంట్రుకల ముద్ద
- శస్త్రచికిత్స చేసి తొలగించిన అనంతపురం జీజీహెచ్ వైద్యులు
- తీవ్ర కడుపునొప్పితో చేరిన బాలికకు అరుదైన రాపుంజల్ సిండ్రోమ్ ఉన్నట్లు గుర్తింపు
- చిన్నప్పటి నుంచి వెంట్రుకలు మింగే అలవాటు వల్ల అవి జీర్ణం కాక కడుపులో పేరుకుపోయిన వైనం
అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) వైద్యులు పదో తరగతి చదువుతున్న ఓ బాలిక కడుపు నుంచి ఏకంగా 750 గ్రాముల వెంట్రుకల ముద్దను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. రాయదుర్గానికి చెందిన సదరు బాలిక తీవ్ర కడుపునొప్పి, అజీర్తి, వాంతులు, వేగంగా బరువు తగ్గిపోవడంతో ఈ నెల 7న తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె కడుపులో గట్టిపడిన ట్రైకోబెజోర్ (వెంట్రుకల ముద్ద) ఉన్నట్లు గుర్తించారు.
చిన్ననాటి నుంచి తల వెంట్రుకలు పీక్కుతినే అలవాటు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తింది. మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాలతో వెంట్రుకలను మింగే అలవాటును వైద్య పరిభాషలో 'ట్రైకోఫాగియా' అంటారు. మానవ జీర్ణరసాలు వెంట్రుకలను కరిగించలేవు. దీంతో ఏళ్ల తరబడి తిన్న వెంట్రుకలు కడుపులో ముద్దగా పేరుకుపోయి, తోకలా చిన్నపేగుల్లోకి విస్తరించాయి. ఈ అరుదైన పరిస్థితిని వైద్యరంగంలో 'రాపుంజల్ సిండ్రోమ్'గా పిలుస్తారు.
అనంతపురం జీజీహెచ్ జనరల్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ రామస్వామి నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం బాలికకు ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ, గ్యాస్ట్రోటమీ శస్త్రచికిత్స ప్రక్రియల ద్వారా 750 గ్రాముల వెంట్రుకల ముద్దను బయటకు తీసి ప్రాణాపాయం తప్పించారు.