- కుల్గాంలో లష్కరే తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను చుట్టుముట్టిన బలగాలు
- మసీదులో నక్కి కాల్పులు జరుపుతున్న దుండగుడు
- వీడియో కాల్ చేసి ‘తోడుంటాం.. లొంగిపోవాలి’ అని కోరిన భద్రతా సిబ్బంది
- లొంగిపోయేందుకు నిరాకరించిన దుండగుడు
- సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌పై దాడితో పాటు పలు హత్యల్లో ఇతడికి సంబంధం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో లష్కరే తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. బుధవారం ఉదయం భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర ఎదురుకాల్పులు మొదలయ్యాయి. నవంబర్ 11న సీఆర్‌పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన దాడిలో లతీఫ్ భట్ ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం అతడు స్థానిక మసీదులో నక్కి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆపరేషన్ సమయంలో భద్రతా బలగాలు అతడికి వీడియో కాల్ చేశాయి. ప్రాణాలతో లొంగిపోవాలని విజ్ఞప్తి చేశాయి. "మేం నీకు తోడుగా ఉంటాం.. లొంగిపో" అని ఓ అధికారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఉగ్రవాది లొంగిపోయేందుకు నిరాకరించాడు. అనంతరం భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాడు.
కుల్గాంలోని పలు గ్రామాల్లో బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ముమ్మరం చేశాయి. లతీఫ్ సహచరుడు ఉమర్ నిసార్ దార్‌ను సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సైన్యం మట్టుబెట్టింది. నవంబర్ 11న జరిగిన దాడికి ముందు వీరిద్దరూ రెక్కీ నిర్వహించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.
దాడికి ముందు మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో వీరు రెక్కీ నిర్వహించారు. గత ఐదారు నెలలుగా ఉమర్ నిసార్ దార్.. లతీఫ్‌కు ఆశ్రయంతో పాటు లాజిస్టిక్స్ సాయం అందించినట్లు విచారణలో తేలింది. లతీఫ్ భట్ గతంలో జులై 22న అనంత్‌నాగ్‌లో పోలీసులపై దాడి చేసి ఒక పోలీసు మరణానికి కారణమయ్యాడు. ఆగస్టు 1న కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్య వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.