అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీనత, అమెరికన్ డాలర్ విలువ బలపడటంతో దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తుండగా, బులియన్ మార్కెట్లో పసిడి నష్టాల బాటలోనే పయనించింది.

జాతీయ స్థాయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1,34,840 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,23,869 వద్ద ఉంది. ఇక 999 ప్యూరిటీ కలిగిన కిలో వెండి ధర రూ. 1,70,340 గా నమోదైంది.

ప్రధాన నగరాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,34,810 ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ. 1,23,576 వద్ద ఉంది. ముంబైలో 24 క్యారెట్లు రూ. 1,34,600.. 22 క్యారెట్లు రూ. 1,23,383 గా నమోదైంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,34,360, చెన్నైలో రూ. 1,34,990, కోల్‌కతాలో రూ. 1,34,420, బెంగళూరులో రూ. 1,34,700 వద్ద కొనసాగుతున్నాయి.

ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం, 999 ప్యూరిటీ బంగారం 10 గ్రాములపై రూ. 770 తగ్గి రూ.  1,34,201 వద్ద ముగిసింది. 916 ప్యూరిటీ బంగారం రూ. 705 క్షీణించి రూ.  1,22,928 వద్ద నిలిచింది. రిటైల్ మార్కెట్లో ప్రముఖ సంస్థలైన తనిష్క్ 22 క్యారెట్ల గ్రాము పసిడిని రూ. 12,520 గా, కల్యాణ్ జ్యువెలర్స్ రూ.  12,470 గా నిర్ణయించాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) ట్రేడింగ్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం నష్టంతో రూ.  1,34,223 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా కామెక్స్ మార్కెట్లో బంగారం 1.19 శాతం తగ్గి ఔన్సుకు 3,818.10 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్ రేట్లు, స్థానిక వ్యాపారుల జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల ఆధారంగా షోరూమ్‌లలో ధరల్లో వ్యత్యాసం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.