- పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్ ఒక పెద్ద స్కామ్ అన్న అనురాగ్ కశ్యప్
- భారీ బడ్జెట్ చిత్రాల వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోందని విమర్శ
- బాలీవుడ్ సినిమాలు సృజనాత్మకతను కోల్పోయి మూస ధోరణిలో ఉన్నాయని వ్యాఖ్య
- మలయాళ చిత్ర పరిశ్రమ ఇతర ఇండస్ట్రీలకు ఆదర్శమని ప్రశంస
పాన్ ఇండియా సినిమా కాన్సెప్ట్‌పై బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదొక పెద్ద స్కామ్ అని, కేవలం లాభాల కోసం నిర్మాతలు, వ్యాపారవేత్తలు సృష్టించిన మోసమని తీవ్రంగా విమర్శించారు. భారీ బడ్జెట్ చిత్రాల మోజులో పడి సినిమా అసలు స్వరూపాన్నే కోల్పోతోందని, ఇది చిన్న సినిమాలను చంపేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన ఛాయా సాహిత్యోత్సవంలో అనురాగ్ కశ్యప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. "ప్రస్తుతం సినిమా ఒక కళారూపంగా కాకుండా పూర్తిగా వ్యాపారంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మెక్‌డొనాల్డ్స్‌లో ఒకే రుచి ఉన్నట్టుగా, బాలీవుడ్ చిత్రాలు కూడా సృజనాత్మకతను కోల్పోయి మూస ధోరణిలో తయారవుతున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాల వల్ల చిత్ర పరిశ్రమ వ్యవస్థ నాశనమవుతోంది" అని అన్నారు.
పాన్ ఇండియా సినిమాల హవా వల్ల చిన్న, కంటెంట్ ఉన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మలయాళ చిత్ర పరిశ్రమను ఆయన కొనియాడారు. "మలయాళ ఇండస్ట్రీ ఒక మంచి వైరస్ లాంటిది. అక్కడ నటులు, దర్శకులు, నిర్మాతల మధ్య అద్భుతమైన సహకారం ఉంటుంది. ఎవరూ తమను తాము పెద్ద హీరోలుగా భావించుకోరు, వందల కోట్లు డిమాండ్ చేయరు. ఈ సంస్కృతి ఇతర పరిశ్రమలకు కూడా వ్యాపించాలి’’ అని ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఫిల్మ్‌మేకర్స్‌లో ఒకరకమైన భయం నెలకొందని, ఏది చూపిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయోననే ఆందోళనతో నిజాయతీగా కథలు చెప్పలేకపోతున్నారని అనురాగ్ కశ్యప్ తెలిపారు.