- చివరి బంతికి గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్న యువ జట్టు
- 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్
- ఆర్యవీర్‌ను 'స్టార్ బాయ్' అంటూ ప్రశంసించిన యువ వైభవ్ సూర్యవంశీ
- 'కంగ్రాచ్యులేషన్స్.. వాట్ ఏ మ్యాచ్!' అంటూ వైభవ్ ఆసక్తికర పోస్ట్
నిన్న జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత యువ జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ చాలా సమయం పాకిస్థాన్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ, ఆఖర్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకున్నారు. గ్రూప్ దశలో పాక్ చేతిలో ఓటమి పాలైన టీమిండియా, ఫైనల్‌లో ప్రతీకారం తీర్చుకుని కప్‌ను సొంతం చేసుకుంది.
ఈ అద్భుత విజయంపై 15 ఏళ్ల యువ భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. ఓ సాధారణ అభిమానిలా మారిపోయిన వైభవ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్నాడు. "కంగ్రాచ్యులేషన్స్, ఓ మ్యాన్... వాట్ ఏ మ్యాచ్!" అంటూ మ్యాచ్ లోని ఉత్కంఠను తన పోస్టులో పేర్కొన్నాడు.
మరో స్టోరీలో, టోర్నీ హీరోగా నిలిచిన వీరేందర్ సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్‌పై ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు. "స్టార్ బోయ్, ఆర్యవీర్ సెహ్వాగ్" అని పోస్ట్ చేశాడు. ఈ టోర్నీలో అత్యధికంగా 361 పరుగులు చేసిన ఆర్యవీర్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఫైనల్‌లోనూ ఓపెనర్‌గా బరిలోకి దిగి 61 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.