- పరిషత్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం
- గ్రామాల్లోనూ ప్రభంజనం కొనసాగాలన్న టీడీపీ అధినేత
- రాబోయే 30 ఏళ్లకు ఉపయోగపడేలా నాయకత్వ నిర్మాణం చేపడదామని సంకల్పం
- ఎట్టి పరిస్థితుల్లో గొడవలకు పోవద్దన్న ముఖ్యమంత్రి
- గతం కంటే కూటమికి 25 శాతం ఓటు బ్యాంకు పెరిగిందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి చారిత్రక విజయాన్ని అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 94 మున్సిపాలిటీల్లో, 3,235 వార్డుల్లో ఎన్డీఏ అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. అలాగే 575 జడ్పీటీసీ స్థానాలు, 7,500 కంటే ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో కూటమి నిలబెట్టిన అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారని వివరించారు. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ పేపర్లు అయినా, చివరకు పోస్టల్ బ్యాలెట్లలోనైనా ప్రజలు కూటమికే సంపూర్ణ మద్దతు పలికారన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వల్లే గతంతో పోలిస్తే కూటమికి ఓటు బ్యాంకు ఏకంగా 25 శాతం పెరిగిందని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వ విధానాలకు మద్దతుగా నిలిచారని, వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలు ఏమాత్రం నమ్మలేదని పేర్కొన్నారు. సుమారు 7 జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని, ముఖ్యంగా అనకాపల్లి, మార్కాపురం జిల్లాల ప్రజలు 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని గుర్తుచేశారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లికి నీటిని అందించడం, మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1 ఫలాలు ఈ ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని విశ్లేషించారు.
రాబోయే రోజుల్లో జరగనున్న మరో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో కూడా కూటమి బలపరిచే అభ్యర్థులే గెలవాలని, క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ ఉన్న మంచి వ్యక్తులను, విద్యావంతులను, యువతను ప్రోత్సహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సరైన నాయకులను తీర్చిదిద్దుకోవడానికి ఈ ఎన్నికలు చక్కటి అవకాశమని, రాబోయే 30 ఏళ్లకు ఉపయోగపడేలా బలమైన నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
కేంద్రం, రాష్ట్రం, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లలో ఇప్పటికే ఎన్డీఏ అధికారంలో ఉందని, పంచాయతీల్లోనూ మన అభ్యర్థులు గెలిస్తే పాలన, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా, సజావుగా ముందుకు సాగుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసినంత కాలం వారు మన వెంటే ఉంటారని స్పష్టం చేశారు. కొందరు కావాలనే హింసను నమ్ముకుంటారని, కానీ కూటమి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని మాత్రమే నమ్ముతుందని చెప్పారు. నాయకులెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవలకు పోవద్దని, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అధికారాన్ని కేవలం ప్రజలకు మంచి చేయడానికి, వారికి మరింత చేరువ కావడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని సీఎం హితవు పలికారు. గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.