- విశాఖపట్నంలో రేపు ప్రారంభం కానున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు
- అనివార్య కారణాలతో అమిత్ షా పర్యటన రద్దు
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
విశాఖపట్నం వేదికగా గురువారం ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం లేదు. అనివార్య కారణాల వల్ల ఆయన విశాఖ పర్యటన రద్దయినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం అందించింది. దీంతో అమిత్ షా స్థానంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. సీఐఐ, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశాయి.
'నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్' అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది. దీనికి దాదాపు 58 దేశాల నుంచి దౌత్యవేత్తలు, అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు కో-ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 13న జరిగే ముగింపు సమావేశానికి భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.