- వియత్నాంలో పెళ్లి కారు బోల్తా
- కారు ముందు భాగంలో అలంకరించిన పూల డెకరేషన్ వల్ల ప్రమాదం
- పొలంలోకి దూసుకెళ్లిన వాహనం
- ఒంటినిండా బురదతో బయటపడ్డ నవ వధువు
- వేడుక ఆగకుండా.. స్నానం చేసి పెళ్లి చేసుకున్న వధువు
పెళ్లికి కొద్ది గంటల ముందు ఓ నవ వధువుకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న పెళ్లి కారు అదుపుతప్పి బురద పొలంలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో 19 ఏళ్ల గర్భిణి అయిన పెళ్లికూతురు ఒంటినిండా బురద అంటుకుంది. వియత్నాంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వియత్నాంలోని ట్యూన్ క్వాంగ్ ప్రావిన్స్‌లో ఈ నెల 10న ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వరుడు లీ వాన్ వియెట్ (21), వధువు డామ్ థీ జువాన్ (19) కారులో వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి బయలుదేరారు. వరుడి ఇంటికి కిలోమీటరు దూరంలో ఉండగా.. బలమైన గాలికి కారు ముందు భాగంలో అలంకరించిన పూల డెకరేషన్ ఎగిరి విండ్‌షీల్డ్‌పై పడింది. దీంతో డ్రైవర్‌కు దారి కనిపించక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మీటరు లోతైన బురద పొలంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో వధూవరులకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, పెళ్లికూతురు జువాన్ దుస్తులు, జుట్టు బురదతో నిండిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి కారును పైకి లేపి వారిని బయటకు తీశారు. అనంతరం వధువు వరుడి ఇంటికి వెళ్లి, స్నానం చేసి మరో డ్రెస్ మార్చుకుని పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.
తర్వాత ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా, వధువు, ఆమె కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం బురదతో నిండిన పెళ్లికూతురి ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.