- తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో విషాదం
- అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన దివ్య
- జనసేనలో క్రియాశీలంగా పని చేస్తున్న దివ్య, ఆమె భర్త శ్రీనివాస్
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒకరోజు ముందు జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి అనారోగ్యంతో కన్నుమూశారు. దేవరపల్లి మండలం ధుమంతునిగూడేనికి చెందిన గారపాటి దివ్య (26) శుక్రవారం రాజమండ్రిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
వివరాల్లోకి వెళితే, ధుమంతునిగూడెం ఎంపీటీసీ స్థానం నుంచి జనసేన తరఫున దివ్య పోటీ చేశారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాత్రికి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.
అయితే, నిన్న ఉదయం ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించడంతో తిరిగి అదే ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్య, ఆమె భర్త శ్రీనివాస్ జనసేనలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దివ్యకు నాలుగు నెలల బాబుతో పాటు మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్న తరుణంలో దివ్య హఠాన్మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.