- విజయవాడ మేయర్గా వంగవీటి రాధా ఘనవిజయం
- ఇది విజయవాడ ప్రజల గెలుపని వ్యాఖ్య
- తన గెలుపు కోసం కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు కృషి చేశారన్న రాధా
విజయవాడ నగర మేయర్గా జనసేన నేత, కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై రాధా భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
ఈ సందర్భంగా వంగవీటి రాధా మాట్లాడుతూ... తనకు మేయర్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం తన ఒక్కడి విజయం కాదని, విజయవాడ ప్రజలందరి విజయమని చెప్పారు. విజయవాడ ప్రజలు చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక కూటమి ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు కృషి చేశారని తెలిపారు. అందరినీ కలుపుకుని నగర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.