- తొలి వారాంతంలో 2.14 మిలియన్ పౌండ్లు వసూలు చేసి అగ్రస్థానం
- తొలి భారతీయ చిత్రంగా రికార్డు
- ‘వైల్డ్ హార్స్ నైన్’, ‘గాడ్జిల్లా మైనస్ జీరో’లను వెనక్కి నెట్టడం విశేషం
- నవంబర్ 12 నుంచి మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల
భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద మరోసారి చాటిచెప్పింది ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’. యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్ చరిత్రలో అగ్రస్థానాన్ని దక్కించుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన తొలి వారాంతంలో ఏకంగా 2.14 మిలియన్ పౌండ్ల వసూళ్లు సాధించింది. జపాన్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’తో పాటు హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (బీఎఫ్‌ఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సోనీ పిక్చర్స్ పంపిణీ చేసిన ఈ సినిమా 361 థియేటర్లలో ప్రదర్శితమైంది. ఒక్కో థియేటర్‌లో సగటున 5,951 పౌండ్ల వసూళ్లు వచ్చాయి. ప్రివ్యూ ప్రదర్శనల ద్వారా 337 ప్రాంతాల్లో 4,35,875 పౌండ్లు సమకూరాయి.
ఇప్పటివరకు యూకే, ఐర్లాండ్ బాక్సాఫీస్ చార్టులో భారతీయ సినిమాలు రెండో స్థానానికే పరిమితమయ్యాయి. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఘనత సాధించాయి. తాజాగా ‘రామాయణ’ వాటన్నింటినీ అధిగమించింది.
ఈ చిత్రం దెబ్బకు గత వారం అగ్రస్థానంలో ఉన్న డిస్నీ సినిమా ‘వైల్డ్ హార్స్ నైన్’ రెండో స్థానానికి పడిపోయింది. అది తొలి వారాంతంలో 1.47 మిలియన్ పౌండ్లు వసూలు చేసింది. జపాన్ చిత్రం ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ 1.39 మిలియన్ పౌండ్లతో మూడో స్థానంలో నిలిచింది.
నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మించిన ‘రామాయణ’ అంతర్జాతీయ విడుదలను దశలవారీగా కొనసాగిస్తోంది. నేడు హాంకాంగ్, మెక్సికో, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో విడుదల కానుంది. నవంబర్ 19న బ్రెజిల్, ఇటలీ, ఉక్రెయిన్, హంగేరీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 20న పోలండ్‌లో, నవంబర్ 26న అర్జెంటీనా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ సహా లాటిన్ అమెరికాలోని మరికొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు.