- రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
- 4 కార్పొరేషన్లు 15 మున్సిపాలిటీలు 4 నగర పంచాయతీలకు ఎన్నికలు
- షెడ్యూల్ ప్రకటించనున్న ఎస్ఈసీ అనిల్ చంద్ర పునీఠ
- హైకోర్టు చిక్కులు తొలగడంతో లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్లో గతంలో వాయిదా పడిన 23 పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్బీ) ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. గురువారం (నవంబరు 12) మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు కీలక నగరాలు, పట్టణాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, వాటిలో 100 సంస్థలకు ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 4 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉండటంతో అక్టోబర్ 14న విడుదల చేసిన సాధారణ నోటిఫికేషన్లో వీటికి చోటు దక్కలేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడం, వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయడంతో ఎస్ఈసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది.
నాలుగు కార్పొరేషన్ల రిజర్వేషన్ల వివరాలు
ఎన్నికలు జరగనున్న నాలుగు ప్రధాన కార్పొరేషన్లలో మొత్తం 260 డివిజన్లు ఉన్నాయి. వీటిలో బీసీలకు 90, ఎస్సీలకు 35, ఎస్టీలకు 5, జనరల్ మహిళలకు 68, ఓపెన్ కేటగిరీకి 62 డివిజన్లు కేటాయించారు.
మేయర్ పదవుల రిజర్వేషన్లను పరిశీలిస్తే:
- శ్రీకాకుళం: బీసీ మహిళ (బీసీ జనరల్)
- కాకినాడ: బీసీ మహిళ
- రాజమహేంద్రవరం: ఎస్సీ (జనరల్)
- మంగళగిరి–తాడేపల్లి: ఎస్టీ
ఈ నాలుగు కార్పొరేషన్లతో పాటు మిగిలిన 19 పురపాలక సంస్థల పరిధిలో మొత్తం 749 వార్డులు ఉండగా, వాటిలో 174 వార్డులను ఓపెన్ కేటగిరీ కింద ఖరారు చేశారు.
ఎన్నికలు జరగనున్న పట్టణ సంస్థల జాబితా (ప్రాంతాల వారీగా):
ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం కార్పొరేషన్ (60 డివిజన్లు), ఆమదాలవలస మున్సిపాలిటీ (శ్రీకాకుళం జిల్లా), రాజాం మున్సిపాలిటీ (విజయనగరం జిల్లా).
గోదావరి – ఏలూరు పరిధి: కాకినాడ కార్పొరేషన్ (66 డివిజన్లు), రాజమహేంద్రవరం కార్పొరేషన్ (72 డివిజన్లు), పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపాలిటీలు (పశ్చిమ గోదావరి జిల్లా), చింతలపూడి నగర పంచాయతీ (ఏలూరు జిల్లా).
కృష్ణా – గుంటూరు – పల్నాడు పరిధి: మంగళగిరి–తాడేపల్లి కార్పొరేషన్ (62 డివిజన్లు), పొన్నూరు మున్సిపాలిటీ (గుంటూరు జిల్లా), గుడివాడ మున్సిపాలిటీ (కృష్ణా జిల్లా), వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ (ఎన్టీఆర్ జిల్లా), నరసరావుపేట మున్సిపాలిటీ (పల్నాడు జిల్లా), బాపట్ల మున్సిపాలిటీ (బాపట్ల జిల్లా).
ప్రకాశం – నెల్లూరు పరిధి: కందుకూరు మున్సిపాలిటీ, పొదిలి నగర పంచాయతీ (ప్రకాశం జిల్లా), కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ (ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా).
రాయలసీమ పరిధి: గూడూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీలు (తిరుపతి జిల్లా), బి. కొత్తకోట నగర పంచాయతీ (అన్నమయ్య జిల్లా).
ఎన్నికల కమిషనర్ నిర్వహించే మీడియా సమావేశంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ గడువులతో పాటు పోలింగ్, కౌంటింగ్ తేదీల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. దీర్ఘకాలంగా పాలకవర్గాలు లేని ఈ పురపాలక సంఘాల్లో ఎన్నికల ప్రకటన వెలువడనుండటంతో స్థానికంగా రాజకీయ సందడి మొదలైంది.