- గురుగ్రామ్‌లో బైక్‌పై 67 చలాన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
- హెల్మెట్, ఇన్సూరెన్స్, పీయూసీ లేకపోవడం వంటివి ప్రధాన ఉల్లంఘనలు
- పత్రాలు చూపించకపోవడంతో బైక్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, కొందరు వాహనదారులు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా గురుగ్రామ్‌లో ఒక ద్విచక్ర వాహనంపై ఏకంగా రూ.4 లక్షలకు పైగా జరిమానాలు పెండింగ్‌లో ఉన్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. రికార్డులను పరిశీలించి విస్తుపోయిన అధికారులు వెంటనే ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం దామ్‌దామా రెడ్‌లైట్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు బృందం వాహన తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఒక బైక్‌ను ఆపి వివరాలను పరిశీలించగా, ఆ వాహనంపై మొత్తం 67 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ చలాన్ల మొత్తం విలువ రూ.4,06,500గా తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
ఈ ఉల్లంఘనల్లో అధిక శాతం హెల్మెట్ ధరించకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ గడువు ముగియడం వంటివే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తనిఖీ సమయంలో వాహనదారుడు సరైన పత్రాలు చూపించడంలో విఫలమవడంతో మోటారు వాహన చట్టం కింద ఆ బైక్‌ను సీజ్ చేశారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడంతో పాటు ఇన్సూరెన్స్, పీయూసీ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇది కేవలం వ్యక్తిగత భద్రతకే కాకుండా, భారీ జరిమానాల నుంచి కూడా రక్షణనిస్తుందని వారు స్పష్టం చేశారు.