- 9 పెళ్లిళ్లు చేసుకుందన్న ఆరోపణలున్న మహిళ కేసులో ఏడో భర్తకు ఊరట
- ఏడో భర్తపై పెట్టిన గృహహింస, వరకట్న వేధింపుల కేసును కొట్టివేసిన కర్ణాటక హైకోర్టు
- పెళ్లి, కేసు, సెటిల్మెంట్.. ఇదే ఆమె పద్ధతంటూ ఆధారాలు సమర్పించిన భర్త
- మహిళ ఆరోపణల్లో నిర్దిష్ట ఆధారాలు లేవని, చట్టాన్ని దుర్వినియోగం చేయొద్దన్న కోర్టు
- చట్టం ప్రైవేట్ డిమాండ్ల సాధనం కాదని స్పష్టీకరణ
తొమ్మిది వివాహాలు చేసుకుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మహిళ.. తన ఏడో భర్తపై పెట్టిన గృహహింస, వరకట్న వేధింపుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆరోపణల్లో నిర్దిష్ట ఆధారాలు లేవని, ఈ కేసు విచారణ కొనసాగించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
హొసపేటకు చెందిన రాజకీయ నాయకుడు రాజా హుస్సేన్‌కు, తబస్సుమ్ అనే మహిళకు 2022 జనవరిలో వివాహం జరిగింది. అయితే, కొన్ని నెలలకే అంటే ఆగస్టులో తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని తబస్సుమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్లు 498ఏ, 323, 504, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉడుపి కోర్టులో విచారణలో ఉండగా, రాజా హుస్సేన్ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
పెళ్లి.. గొడవ.. కేసులు
ఫిర్యాదుదారు(తబస్సుమ్)కి ఇదివరకే ఎనిమిది వివాహాలు జరిగాయని, తాను ఏడో భర్తనని హుస్సేన్ కోర్టుకు తెలిపారు. పెళ్లి చేసుకోవడం, గొడవ పడటం, కేసులు పెట్టి డబ్బుల కోసం సెటిల్మెంట్కు ఒత్తిడి చేయడం ఆమెకు అలవాటుగా మారిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. అయితే, భర్త వాదనలను తబస్సుమ్ తరఫు న్యాయవాది ఖండించారు. తాను కేవలం నాలుగు సార్లే పెళ్లి చేసుకున్నానని, ప్రతిసారీ చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే మరో వివాహం చేసుకున్నానని వాదించారు.
చార్జిషీట్.. ఆరోపణలకు బలపడవు
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న.. భర్తపై పెట్టిన కేసును కొట్టివేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. భార్య చేసిన ఆరోపణలు సాధారణంగా, అస్పష్టంగా ఉన్నాయని, వాటికి నిర్దిష్టమైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. కేవలం చార్జ్‌షీట్ దాఖలు చేసినంత మాత్రాన బలహీనమైన ఆరోపణలకు బలం చేకూరదని పేర్కొంది.
ఈ సందర్భంగా కోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. "ఒక వ్యక్తి ఎన్నిసార్లు వివాహం చేసుకున్నారనే అంశం ఆధారంగా వారి నైతికతను లేదా నేర ప్రవృత్తిని అంచనా వేయలేం. అదే సమయంలో, అసాధారణ వివాహ చరిత్ర ఉన్నంత మాత్రాన ఒకరి ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చలేం" అని స్పష్టం చేసింది. అయితే, క్రిమినల్ చట్టాన్ని ప్రైవేట్ డిమాండ్లను తీర్చుకునే సాధనంగా వాడుకోకూడదని హితవు పలికింది. ప్రస్తుత కేసులోని ఆధారాల ప్రకారం విచారణ కొనసాగించడం న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ, హుస్సేన్‌పై ఉన్న కేసును రద్దు చేసింది.