- స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపిన సీఎం
- తమ సుపరిపాలన, అభివృద్ధి పనులకే ఈ విజయం నిదర్శనమని వెల్లడి
- గొడ్డలి పార్టీ హింసా రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని విమర్శ
- ఎన్నికలను అడ్డుకునేందుకు విపక్షం చేసిన కుట్రలను సుప్రీంకోర్టు తిప్పికొట్టిందన్న సీఎం
- తుపానుల సమయంలోనూ ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చామన్న చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన అఖండ విజయం తమ సుపరిపాలనకు, అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి పౌరుడికి భద్రత కల్పిస్తూ, భరోసా ఇస్తున్న తమ ప్రభుత్వానికే ప్రజలు మద్దతుగా నిలిచారని, రాజకీయ పార్టీకి ఇంతకంటే పెద్ద రివార్డు ఏముంటుందని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు, స్థానిక ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పు తమపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మార్కాపురంలో 21కి 21, అనకాపల్లిలో 24కి 24 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. విశాఖ మేయర్ స్థానాన్ని 2.50 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో కట్టబెట్టారు. ప్రజల కోసం కష్టపడి పనిచేస్తే వారు అండగా ఉంటారని ఈ ఫలితాలు నిరూపించాయి" అని అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల వల్లే ఈ విజయం సాధ్యమైందని చంద్రబాబు వివరించారు.
"సీమ కరువుకు చెక్ పెట్టేలా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాం. వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, మళ్లీ తొలిదశను ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చింది మేమే. పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకెళ్లాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు రెక్కలు తొడిగాం. ప్రజల కోరిక మేరకు మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశాం" అని ఆయన గుర్తుచేశారు.
ప్రతిపక్ష వైసీపీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "మేం ప్రజల్ని, వారి నమ్మకాన్ని విశ్వసిస్తే, గొడ్డలి పార్టీ నేరాలను, ఘోరాలనే నమ్ముకుంది. ఎన్నికల్లో హింసను ప్రేరేపించింది. తీవ్రవాదుల తరహాలో హిట్ అండ్ రన్ రాజకీయాలు చేసింది. కానీ, హింసా రాజకీయాలను ప్రజలు ఎన్నడూ ఆమోదించరు. ఇదేమీ రాతియుగం కాదు.. రౌడీయిజం, డ్రామాలతో ప్రజా తీర్పును మార్చలేరని గొడ్డలి పార్టీ గుర్తించుకోవాలి" అని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. "బీసీ రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి అంశాలపై పిటిషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవాలని చూశారు. కానీ, సుప్రీంకోర్టు వారి ప్రయత్నాలకు చెక్ పెట్టింది. ‘వైసీపీ ట్రాప్లో పడబోం’ అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించే దుస్థితికి ఆ పార్టీ దిగజారింది" అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రెండు తుఫాన్లు వస్తే ప్రజలను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం నిమగ్నమైందని, కానీ ప్రతిపక్షం కనీసం స్పందించలేదని, వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని చంద్రబాబు విమర్శించారు. తాము ఎన్నికల కన్నా ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇచ్చామని, దీనిని ప్రజలు అర్థం చేసుకుని తమకు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.