- ఉత్కంఠను రేకెత్తించే 'ది వన్'
- ఫారెస్టు చుట్టూ తిరిగే కథ
- ప్రధానమైన పాత్రలలో సిద్ధార్థ్ మల్హోత్రా - తమన్నా
- ఈ నెల 6వ నుంచి మొదలైన స్ట్రీమింగ్
- అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో
అది ఒక దట్టమైన అడవి .. పొద్దుపోయిన తరువాత ఆ అడవి వైపు ఎవరూ వెళ్లరు. ఏం కాదులే అంటూ అటుగా వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రాలేదు. అడవిలో వనదేవత విహరిస్తూ ఉంటుందనీ .. ఆ సమయంలో ఎవరైనా అటుగా వెళితే చంపేస్తుందని అంతా భావిస్తుంటారు. అలాంటి పరిస్థితులలో 'రిషి' తన భార్య 'మమత'ను తీసుకుని ఆ గ్రామానికి చేరుకుంటాడు. తన పూర్వీకులకు సంబంధించిన ఆస్తిపాస్తులను అమ్ముకుని వెళ్లడానికి వస్తాడతను. తాను వచ్చిన పనిని పూర్తి చేయడానికి అడ్డుగా ఉన్న అడవిని టచ్ చేయడానికి అతను సిద్ధపడతాడు.
ఆ గ్రామస్తులంతా కూడా ఆ అడవి వనదేవత నివాసమనీ, అలాంటి అడవి జోలికి వెళితే వనదేవతకి ఆగ్రహం కలుగుతుందని రిషికి చెబుతారు. అదంతా ఒక మూఢనమ్మకం అని భావించిన రిషి లైట్ తీసుకుంటాడు. తాను అనుకున్న పనిని పూర్తి చేసే తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అప్పటి నుంచి అతనికి ఎలాంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి? దాంతో అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా? మూర్ఖంగా ముందుకు వెళతాడా? అనేది కథ.
ఈ కథ అంతా కూడా 'ది వన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' అనే సినిమాకి సంబంధించినది. అడ్వెంచర్ తో ముడిపడిన హారర్ యాక్షన్ మూవీ ఇది. ఏక్తా కపూర్ - శోభా కపూర్ నిర్మించిన ఈ సినిమాకి, దీపక్ మిశ్రా దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా - తమన్నా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. అమిత్ త్రివేది - సామ్ సీఎస్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.