ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం రెండు భారీ సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఒకటి రజనీకాంత్ 'జైలర్ 2' అయితే, మరొకటి విజయ్ దేవరకొండ 'రణబాలి'. రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' సినిమాను తెరకెక్కించాడు. అక్టోబర్ 15వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను థియేటర్లకు తీసుకొచ్చారు. గతంలో వచ్చిన ఫస్టు పార్టు మాదిరిగానే ఈ సినిమాను  రజనీకాంత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. 

'జైలర్' సినిమా స్థాయిలో పార్టు 2 లేకపోయినా, ఈ సినిమాలోని కొన్ని అంశాలు ప్రేక్షకులను చాలా బలంగా పట్టుకున్నాయి. యాక్షన్ .. ఎమోషన్స్ పరంగా మెప్పించగలిగింది. 800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగలిగింది. అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలోను ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఈ నెల 13వ తేదీన 'రణబాలి' కూడా రంగంలోకి దిగనుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, అక్టోబర్ 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఆకట్టుకుంటుంది. ఆంగ్లేయుల కాలంనాటి ఈ కథలో తిరుగుబాటుదారుడిగా విజయ్ దేవరకొండ కనిపిస్తాడు.మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాలకి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందనేది చూడాలి.