- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్న చంద్రబాబు
- మనం వెలిగించే దీపం సమాజానికి కూడా వెలుగునివ్వాలని ఆకాంక్ష
- ప్రజలకు లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలన్న నారా లోకేశ్
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సందేశాలను పంచుకున్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే దీపావళి, ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. "నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తి లభించిన పవిత్రమైన రోజు ఇది. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలి. మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికీ వెలుగునివ్వాలి. సాటివారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలి" అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. పండుగ పరమార్థాన్ని అర్థం చేసుకుని, పరస్పర సహకారంతో అందరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సైతం ప్రజలందరికీ వెలుగుల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహాలక్ష్మి కటాక్షంతో అందరికీ సిరిసంపదలు చేకూరాలని ఆయన ప్రార్థించారు. "ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఆనందాలు కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తలపెట్టే పనుల్లో విజయం సిద్ధించాలి. ఇంటిల్లిపాదీ సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో ఈ దీపావళి వేడుకలను జరుపుకోవాలి" అని లోకేశ్ ఆకాంక్షించారు.