- మురసు తుపాను కారణంగా 71 వేల క్యూసెక్కులకు చేరిన ఇన్‌ఫ్లో
- ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12 అడుగులుగా కొనసాగుతున్న నీటిమట్టం
- సముద్రంలోకి నీటి విడుదలను 3,625 క్యూసెక్కులకు తగ్గించిన అధికారులు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉద్ధృతి గణనీయంగా తగ్గింది. ఇటీవలి మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా నదికి ప్రవాహం పెరిగి, బ్యారేజీకి సుమారు 71 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో అటు అధికారులు, ఇటు డెల్టా రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం 12 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. వరద ప్రవాహం తగ్గడంతో సముద్రంలోకి వదిలే నీటి విడుదలను కూడా అధికారులు క్రమంగా తగ్గిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 7,250 క్యూసెక్కులుగా ఉన్న అవుట్‌ఫ్లోను సాయంత్రానికి 3,625 క్యూసెక్కులకు పరిమితం చేశారు.
అదే సమయంలో, కృష్ణా తూర్పు డెల్టా సాగునీటి అవసరాల కోసం కాలువలకు సుమారు 1,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో పూర్తిగా అదుపులోకి రావడంతో కృష్ణా డెల్టా ప్రాంతానికి వరద ముప్పు తప్పినట్లయిందని అధికారులు భావిస్తున్నారు.