- దీపావళిని ‘ఖుషియోన్ కీ ఈద్’ అన్న ఖర్గే
- మతపరమైన బుజ్జగింపులు అంటూ కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణలు
- హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న కేశవన్
- ఈద్‌తో పోల్చడంపై భాటియా అభ్యంతరం
- ఐక్యత కోసమే ఆ పదం వాడారన్న కాంగ్రెస్
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు దేశ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. దీపావళిని ‘ఖుషియోన్ కీ ఏక్ ఈద్’ (సంతోషాల పండగ)గా అభివర్ణించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనారిటీలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ మతపరమైన బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే ‘అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకొనే సంతోషాల పండగ’ అనే ఉద్దేశంతోనే ఖర్గే ఆ పదాన్ని ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు వివరణ ఇచ్చారు.
దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఖర్గే.. దేశ ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి దేశమంతటా అందరూ జరుపుకొనే పెద్ద పండగని, సంతోషాలను పంచే వేడుకని పేర్కొన్నారు. దీర్ఘకాలం పాటు కొనసాగే ఆనందోత్సవమని చెబుతూ ‘ఖుషియోన్ కీ ఏక్ ఈద్’ అనే పదాన్ని ఉపయోగించారు. పండగ వేళ ప్రజల మధ్య ఐక్యత పెరగాలని, సామాజిక విభేదాలు తొలగిపోవాలని పిలుపునిచ్చారు.
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ దీపావళిని మరో మతానికి చెందిన పండగతో పోల్చడం ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. మతపరమైన బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. గతంలో ఖర్గే మహాకుంభమేళాపై చేసిన వ్యాఖ్యలను, రాహుల్ గాంధీ ఛఠ్ పూజ సందర్భంగా ప్రధాని మోదీపై చేసిన విమర్శలను కూడా ప్రస్తావించారు.
మరో బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ.. ఖర్గే వ్యాఖ్యలను బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనంగా అభివర్ణించారు. ఈద్‌ను హిందూ పండగతో పోల్చి కాంగ్రెస్ నేతలు మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ నేత గౌరవ్ భాటియా కూడా దీపావళికి ప్రత్యేకమైన సంప్రదాయాలు, గుర్తింపు ఉన్నాయని.. ఆ పండగను అదే పేరుతో గౌరవించాలని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ మాత్రం ఖర్గే వ్యాఖ్యలను సమర్థించింది. ‘ఈద్’ అనే పదాన్ని మతపరమైన అర్థంలో కాకుండా సంతోషాల వేడుకగా విస్తృత భావంలో ఉపయోగించారని వివరించింది. వివిధ మతాలు, సంస్కృతుల మధ్య ఐక్యతను చాటడమే ఆయన ఉద్దేశమని తెలిపింది. మరోవైపు ఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ కూడా ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. రెండు పండగలను రాజకీయ ప్రయోజనాల కోసం పోల్చడం సరికాదని వ్యాఖ్యానించారు. దీంతో దీపావళి శుభాకాంక్షల సందర్భంగా మొదలైన వివాదం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలకు వేదికగా మారింది.