- నవంబర్ 17తో ఐపీఎల్ రిటెన్షన్ల గడువు ముగింపు
- కేకేఆర్ నుంచి కామెరాన్ గ్రీన్ విడుదలయ్యే అవకాశం
- ముంబై నుంచి హార్దిక్ పాండ్యా విడుదలయ్యే అవకాశం ఉందని పుజారా అంచనా
- గుజరాత్ నుంచి తెవాటియా లేదా షారుఖ్‌కు ఉద్వాసన అని అంచనా
- సన్‌రైజర్స్ నుంచి ఉనద్కత్, హర్షల్లలో ఒకరికి షాక్ తప్పదన్న పుజారా
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఆటగాళ్ల రిటెన్షన్లపై ఆసక్తికర చర్చ మొదలైంది. నవంబర్ 17తో ఆటగాళ్లను అట్టిపెట్టుకునే గడువు ముగియనుండటంతో ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై దృష్టి సారించాయి. ఇప్పటికే పలు ట్రేడింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లి, ఆ జట్టు పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబైకి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా పది జట్లలో ఎవరెవరు విడుదలయ్యే అవకాశం ఉందో తన అంచనాలు వెల్లడించాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ విడుదల కావచ్చని పుజారా అభిప్రాయపడ్డాడు. 2026 వేలంలో అతడిని కేకేఆర్ రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచిన గ్రీన్‌ను విడుదల చేసినా, తిరిగి వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పుజారా పేర్కొన్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మాట్ హెన్రీ, మాథ్యూ షార్ట్‌లలో ఒకరిని వదులుకోవచ్చని అంచనా వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఏ ఆటగాడినీ విడుదల చేయకపోవచ్చని చెప్పాడు. ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లలో ఒకరికి జట్టు వీడ్కోలు పలకవచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ ఇద్దరూ ఆశించిన స్థాయిలో రాణించలేదని వివరించాడు.
పంజాబ్ కింగ్స్ నుంచి జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్‌లలో ఒకరిని విడుదల చేయవచ్చని పుజారా అంచనా వేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్‌లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీ షా, కరుణ్ నాయర్‌లలో ఒకరిని వదులుకోవచ్చని పేర్కొన్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసిన నికోలస్ పూరన్‌ను విడుదల చేసే అవకాశముందని పుజారా అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అతడిని కొనసాగించాలని నిర్ణయిస్తే ఆయుష్ బదోనీని వదులుకోవచ్చని తెలిపాడు. రాజస్థాన్ రాయల్స్ ఎవరిని విడుదల చేస్తుందన్న దానిపై స్పష్టత లేదని, అయితే ఆ జట్టు నుంచి ఒక భారత ఆటగాడు బయటకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాడు.