- ఇన్నోవా క్రిస్టా లిమోను విడుదల చేసిన టయోటా
- ప్రారంభ ధర రూ.19.95 లక్షలు.. 2.4 లీటర్ల డీజిల్ ఇంజిన్
- ఏడు, ఎనిమిది సీట్ల వెర్షన్లు అందుబాటులోకి
- మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొత్త వేరియంట్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లోకి కొత్త ఇన్నోవా క్రిస్టా లిమో వేరియంట్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా టాక్సీ, ట్రావెల్స్ సంస్థలు, ఇతర వాణిజ్య వాహన నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించింది. ఏడు సీట్ల వెర్షన్ ధరను రూ.19.95 లక్షలుగా, ఎనిమిది సీట్ల వెర్షన్ ధరను రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు.
ఇన్నోవా క్రిస్టా లిమోను ప్రత్యేకంగా జీఎక్స్-ఎస్‌ఎల్‌ఎఫ్ గ్రేడ్‌లో అందిస్తోంది. సాధారణ ఇన్నోవాతో పోలిస్తే ఇంజిన్, గేర్‌బాక్స్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ సీట్లను కూడా అందిస్తోంది. రెండో వరుసలో వ్యక్తిగత సీటింగ్‌కు ప్రాధాన్యమిచ్చే వారు ఏడు సీట్ల వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. అదనంగా మరో ప్రయాణికుడికి చోటు కల్పించేలా ఎనిమిది సీట్ల వెర్షన్‌ను రూపొందించింది.
ఈ వాహనంలో 2.4 లీటర్ల నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సాధారణ ఇన్నోవా క్రిస్టా గరిష్ఠంగా లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుదూర ప్రయాణాలు, తరచూ ప్రయాణికులను తీసుకెళ్లే వాణిజ్య అవసరాలకు ఇది అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
కొనుగోలుదారులకు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు ప్రామాణిక వారంటీ లభిస్తుంది. అదనపు మొత్తంతో ఐదేళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని పొడిగించుకోవచ్చు. ఏడేళ్ల వరకు ఫైనాన్స్ సదుపాయాలు, తక్కువ ఈఎంఐ పథకాలు, త్వరిత సర్వీసింగ్, 24 గంటల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయాలను కూడా టయోటా అందిస్తోంది.