- చమురు శుద్ధి సామర్థ్యంలో భారత్‌కు ప్రపంచంలో నాలుగో స్థానం
- ఏడాదికి 267.1 మిలియన్ టన్నుల ప్రస్తుత సామర్థ్యం
- 2030 నాటికి 300 మిలియన్ టన్నుల లక్ష్యం
- ముడి చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారం
- ఆరు నెలల్లో పెట్రోలియం ఎగుమతుల విలువ 27.2 బిలియన్ డాలర్లు
ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్.. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గించుకుంటుంటే.. భారత్ మాత్రం దాన్ని విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో దేశానికి వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తోందని ‘ఇండియా నెరేటివ్’ కథనం విశ్లేషించింది.
2026 ఏప్రిల్ నాటికి భారత్ చమురు శుద్ధి సామర్థ్యం ఏడాదికి 267.1 మిలియన్ టన్నులుగా ఉంది. రోజుకు సుమారు 53 నుంచి 56 లక్షల బ్యారెళ్లకు సమానమైన ఈ సామర్థ్యంతో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, రష్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2030 నాటికి శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలంలో 400 మిలియన్ టన్నులకు చేర్చాలని భావిస్తోంది.
భారత్ రోజుకు 54 నుంచి 56 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా వాటా ఇటీవల 18 నుంచి 20 లక్షల బ్యారెళ్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఇది దాదాపు 35 శాతం. గతంలో ఈ వాటా 50 శాతాన్ని దాటిన సందర్భాలున్నాయి. ధరల ఆధారంగా భారత్ కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటోందని కథనం పేర్కొంది.
మరోవైపు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా భారత్‌కు భారీ ఆదాయం వస్తోంది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఈ ఎగుమతుల విలువ 27.2 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో డీజిల్ వాటా 12.6 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్‌లో రోజుకు సుమారు 6.2 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను భారత్ ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు సగం ఐరోపా దేశాలకే వెళ్లింది. రష్యా ఉత్పత్తులపై పరిమితులు, ఐరోపాలో రిఫైనరీల మూసివేత, మధ్యప్రాచ్యంలో నిర్వహణ పనుల కారణంగా ఏర్పడిన కొరతను భారత ఎగుమతులు కొంతవరకు భర్తీ చేస్తున్నాయి.
రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు, సుంకాల ఒత్తిడి తెస్తున్నా.. భారత రిఫైనరీల్లో శుద్ధి చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరాకు ఉపయోగపడుతున్నాయని కథనం విశ్లేషించింది. ఇంధన ధరలు పెరిగినప్పుడు అమెరికా కూడా కొన్ని ఆంక్షల విషయంలో మినహాయింపులు ఇచ్చిందని గుర్తుచేసింది. భారత్ రిఫైనింగ్ సామర్థ్యం పెరిగితే ప్రపంచ మార్కెట్‌లో సరఫరా సమతుల్యతను ప్రభావితం చేసే స్థాయిలో దేశం నిలుస్తుందని పేర్కొంది.