- రుణ హామీదారుపైనా చట్టపరమైన బాధ్యత
- రుణగ్రహీత ఎగవేస్తే బకాయిలు చెల్లించాల్సి రావచ్చుంటున్న నిబంధనలు
- అత్యవసర పొదుపు సొమ్ముకు ముప్పు ఏర్పడే అవకాశం
- మీ క్రెడిట్ స్కోర్ తగ్గే ప్రమాదమూ ఉందంటున్న నిపుణులు
- భవిష్యత్తులో రుణ అర్హత ప్రభావితం కావచ్చని హెచ్చరిక
స్నేహితుడో, బంధువో బ్యాంకు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు అర్హతలు సరిపోక మీ సాయం కోరవచ్చు. గ్యారంటీగా సంతకం చేయాలని అడగవచ్చు. వారి మీద నమ్మకంతో చాలామంది వెంటనే అంగీకరిస్తుంటారు. కానీ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే రుణానికి హామీదారుగా సంతకం చేయడం అంటే కేవలం స్నేహితుడికి సాయం చేయడం మాత్రమే కాదు.. అతడు లోన్ వాయిదాలు చెల్లించకపోతే ఆ బాధ్యతను మీరూ స్వీకరించడమే. భారత్‌లో రుణ హామీ ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, రుణగ్రహీత చెల్లించాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకు మిమ్మల్ని కూడా బాధ్యులుగా చేయవచ్చు.
మీ సేవింగ్స్కూ ముప్పు
రుణగ్రహీత వాయిదాలు చెల్లించడంలో విఫలమైతే, ఒప్పంద నిబంధనల ప్రకారం బ్యాంకు బకాయి మొత్తాన్ని మీ నుంచి వసూలు చేసేందుకు ప్రయత్నించవచ్చు. ఈ పరిణామం మీ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అత్యవసర అవసరాల కోసం దాచుకున్న డబ్బు, భవిష్యత్తు ఖర్చుల కోసం కూడబెట్టిన సొమ్ము కూడా లోన్ చెల్లింపులకు వినియోగించాల్సి రావచ్చు. బకాయిలు అలాగే ఉంటే బ్యాంకు చట్టపరమైన చర్యలకూ దిగవచ్చు. కొన్ని పరిస్థితుల్లో మీ ఆస్తులకూ ముప్పు ఏర్పడవచ్చు.
మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినొచ్చు
మీరు తీసుకోని లోన్ కారణంగా మీ క్రెడిట్ హిస్టరీపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ప్రధాన రుణగ్రహీత వాయిదాలు సకాలంలో చెల్లించకపోయినా, లోన్ ఎగవేసినా ఆ వివరాలు క్రెడిట్ సమాచార సంస్థలకు చేరే అవకాశం ఉంది. దీంతో మీ క్రెడిట్ స్కోర్ తగ్గవచ్చు. భవిష్యత్తులో వ్యక్తిగత రుణం, గృహ రుణం, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ హిస్టరీని పరిశీలిస్తాయి. అప్పుడు మీరు ఇప్పటివరకు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించినా, హామీ ఇచ్చిన లోన్ ప్రతికూలతలు మీపై ప్రభావం చూపవచ్చు.
భవిష్యత్తులో మీకు రుణం రావడం కష్టమవుతుందా?
మరొకరి లోన్‌కు హామీగా నిలవడం మీ భవిష్యత్తు రుణ అర్హతపైనా ప్రభావం చూపవచ్చు. ఆ హామీని బ్యాంకులు మీపై ఉన్న ఆర్థిక బాధ్యతగా పరిగణించే అవకాశం ఉంది. మీరు సొంతంగా ఇల్లు కొనాలనుకున్నా, కారు తీసుకోవాలనుకున్నా లేదా వ్యక్తిగత అవసరాల కోసం రుణం కోరినా ఈ అంశాన్ని పరిశీలించవచ్చు. హామీగా ఉన్న మొత్తం ఎక్కువైతే, మీకు మంజూరయ్యే రుణ పరిమితి తగ్గే అవకాశముంది.
హామీ ఇచ్చే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రుణానికి గ్యారంటీగా సంతకం చేసే ముందు ఒప్పందాన్ని పూర్తిగా చదవాలి. రుణగ్రహీత చెల్లించకపోతే మీపై పడే బాధ్యత ఎంత? వడ్డీ, ఆలస్య రుసుములు, జరిమానాలు సహా ఎంత మొత్తం చెల్లించాల్సి రావచ్చు? ఏ పరిస్థితుల్లో బ్యాంకు మీ నుంచి డబ్బు వసూలు చేయవచ్చు? వంటి అంశాలను స్పష్టంగా తెలుసుకోవాలి. రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆదాయం ఎంత? ఇప్పటికే ఇతర రుణాలు ఉన్నాయా? గతంలో వాయిదాలను సక్రమంగా చెల్లించారా? అన్న విషయాలనూ పరిశీలించాలి.
స్నేహితులు, బంధువులకు ఆర్థికంగా అండగా నిలవడం మంచి విషయమే. అయితే ఆ సాయం మీకు భారంగా మారకూడదు. రుణగ్రహీత చెల్లించకపోతే మొత్తం బకాయిని మీరే చెల్లించగలరా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోండి. ఆ బాధ్యతను భరించే పరిస్థితి లేకపోతే గ్యారంటీగా సంతకం చేయకపోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.