మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష!
- నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య
- మృతదేహాన్ని సిమెంట్ నింపిన డ్రమ్‌లో దాచిన నిందితులు
- 22 మంది సాక్షుల వాంగ్మూలాల పరిశీలన
- ఫోన్ రికార్డులు, ఇతర ఆధారాలతో కేసు నిరూపణ
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసిన కేసులో ఆయన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. 126 విచారణల తర్వాత 22 మంది సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
2025 మార్చి 3న ముస్కాన్ తన భర్తకు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చిందని, ఆ తర్వాత సాహిల్‌తో కలిసి కత్తితో పొడిచి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ వెల్లడించింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఇసుక, నీరు, సిమెంట్‌తో నింపిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచినట్లు దర్యాప్తులో తేలింది.
హత్య జరిగిన మరుసటి రోజు ఇద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లిపోయారు. సౌరభ్ బతికే ఉన్నట్లు నమ్మించేందుకు ముస్కాన్ ఆయన ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. మార్చి 17న బంధువులు అనుమానంతో అధికారులతో కలిసి ఇంటికి వెళ్లగా డ్రమ్‌లో సౌరభ్ మృతదేహం బయటపడింది. అనంతరం పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
డ్రమ్, సిమెంట్, ఇసుక, కత్తులు కొనుగోలు చేసిన దుకాణదారుల వాంగ్మూలాలతో పాటు ఫోన్ కాల్ రికార్డులు, మొబైల్ లొకేషన్ వివరాలను పోలీసులు సాక్ష్యాలుగా సమర్పించారు. నిందితులు నేరానికి పాల్పడినట్లు ఈ ఆధారాలు నిరూపించాయని ప్రాసిక్యూషన్ వాదించింది.