తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలుచోట్ల 37 డిగ్రీల ఉష్ణోగ్రత
Add ap7am to your home Screen

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలుచోట్ల 37 డిగ్రీల ఉష్ణోగ్రత

Telangana scorching heat 37 degrees temperature recorded in several places
  • తెలంగాణలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత
  • ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం
తెలంగాణలో ఎండల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. పగటిపూట ఎండ ప్రతాపం, రాత్రివేళల్లో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు కాగా, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 36.2 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించిది. రుతుపవనాల నిష్క్రమణ ప్రభావం వల్లే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనుదిరిగాయని, శుక్రవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇవి పూర్తిగా నిష్క్రమిస్తాయని అధికారులు వివరించారు. దీని ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Advertisement
Telangana
Telangana weather update
Southwest monsoon withdrawal
Telangana rising temperatures
Adilabad weather

More Telugu News