తీర్థం ఇస్తే తాగరు.. తాగినట్టు నటిస్తారు.. ఇదే వారు పాటించే సెక్యులరిజం: తిరుపతిలో విజయసాయి రెడ్డి
- కొందరికి తీర్థం ఇస్తే.. వేళ్ల సందుల నుంచి వదిలేస్తారన్న విజయసాయి
- వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో అక్రమాలు నిజమేనని వెల్లడి
- ఏపీలో తమ పార్టీ మూడో ప్రధాన శక్తిగా ఎదుగుతుందని ధీమా
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆలయాలకు వెళ్లినప్పుడు అర్చకులు తీర్థం ఇస్తే, తాగినట్లు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారని, ఇదే వారు పాటించే సెక్యులరిజం అని ఆయన విమర్శించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను స్వచ్ఛమైన హిందువునని, ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు కూడా వెళతానని అన్నారు.
ఈ సందర్భంగా ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసేలా తమ పార్టీ ఉంటుందని తెలిపారు. అధికార టీడీపీ కూటమి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ తర్వాత తమ పార్టీ మూడో ప్రధాన శక్తిగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిలబడుతూ, ప్రభుత్వం, ప్రతిపక్షంపై నిర్మాణాత్మక విమర్శలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై కూడా సాయిరెడ్డి స్పందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో అక్రమాలు జరిగాయని అంగీకరించారు. అయితే, ప్రసాదంలో జంతు కొవ్వు ఉందన్న ఆరోపణలను ఆయన గట్టిగా ఖండించారు. తాము కిలో నెయ్యిని రూ. 320-400 మధ్య కొంటే, ప్రస్తుత ప్రభుత్వం రూ. 658కి కొంటోందని, బహిరంగ మార్కెట్‌లో స్వచ్ఛమైన నెయ్యి ధర రూ. 1,000 పైనే ఉందని పేర్కొంటూ నెయ్యి నాణ్యతను ప్రశ్నించారు.
కడప జిల్లాలోని కొన్ని ఆలయాల్లోకి ఇప్పటికీ దళితులను అనుమతించడం లేదని ఆరోపించిన ఆయన... తమ పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి వివక్ష చూపేవారికి కఠిన శిక్షలు, జైలు శిక్ష తప్పవని హెచ్చరించారు.