ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ.. పోలవరం, జలధారపై కీలక చర్చ
Add ap7am to your home Screen

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చంద్రబాబు భేటీ.. పోలవరం, జలధారపై కీలక చర్చ

Chandrababu Naidu meets Union Jal Shakti Minister CR Patil in Delhi to discuss Polavaram and Jaladhara
  • ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు
  • కీలక ప్రాజెక్టుల పురోగతిని సీఆర్ పాటిల్‌కు వివరించిన చంద్రబాబు
  • అమరజీవి జలధారకు నిధులు ఇవ్వాలని విన్నపం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కీలక జల ప్రాజెక్టుల పురోగతిని, నిధుల అవసరాన్ని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ముఖ్యంగా పోలవరం, జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రంలో రూ.30,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 'జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార' పథకం వివరాలను చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని 95 లక్షల గ్రామీణ కుటుంబాలకు గాను ఇప్పటికే 62 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, ఈ కొత్త పథకం ద్వారా మరో 27 లక్షల కుటుంబాలకు నీటి కనెక్షన్లు అందించడమే లక్ష్యమని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.

అనంతరం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై కూడా ఇరువురు నేతలు సమీక్షించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా సాగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టుకు నిధుల కొరత లేకుండా కేంద్రం పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు, దక్షిణాది రాష్ట్రాల్లోని ఐదు నదుల అనుసంధానం అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

Advertisement
Chandrababu Naidu
CR Patil
Polavaram Project
Jal Jeevan Mission
Amarajeevi Jaladhara
Andhra Pradesh Water Projects

More Telugu News